జగన్ గారు... ఇదేం పాలన ...!!   విద్యార్ధిని సైతం వదిలిపెట్టరా ?  - నారా లోకేష్

సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ పై  నారా లోకేష్ మరోసారి ధ్వజమెత్తారు.

Last Updated : Jul 27, 2019, 01:56 PM IST
జగన్ గారు... ఇదేం పాలన ...!!   విద్యార్ధిని సైతం వదిలిపెట్టరా ?  - నారా  లోకేష్

టీడీపీ కార్యకర్తలపై దాడులు, అరెస్టులను అనేక సందర్భాల్లో... అనేక వేదికలపై ఖండించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశంపై మరో మారు ట్విట్వర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్ధి విభాగానికి చెందిన వర్ధన్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన నారా లోకేష్ .. చివరికి విద్యార్థి మీద అక్రమ కేసులు పెట్టే స్థాయికి వైసీపీ సర్కార్ దిగజారిపోయిందని ఆరోపించారు. 

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోట్ చేస్తూ ....  మీరెన్ని ఇబ్బందులకు గురిచేసినా.. నేనూ, మా పార్టీ వారు వర్ధన్ కి అన్ని విధాలుగా అండగా ఉంటామని లోకేష్ పేర్కొన్నారు. ఇలాంటి  మీ పిరికిపంద చర్యలను  తప్పకుండా తిప్పికొడతామన్నారు. ఈ ట్వీట్ కు ''మేం వర్థన్ కు సపోర్ట్ గా ఉంటాం '' ..'' మేం  వర్థన్ తో ఉంటాం " అనే హ్యాట్ ట్యాగ్స్ పెట్టారు. 

 

Trending News