మోడీ సర్కార్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్;  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమౌతున్న కార్మికులు !

తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి

Last Updated : Jan 1, 2019, 01:30 PM IST
మోడీ సర్కార్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్;  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమౌతున్న కార్మికులు !

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సీర్కార్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు కార్మిక సంఘాలు సిద్ధమౌతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం తమ డిమాండ్ల సాధన కోసమే సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగాలని వామపక్షాల అనుబంధ కార్మికు సంఘం ఐఎఫ్టీయూ ప్రకటించింది. వీటికి మరికొన్ని కార్మిక సంఘాల మద్దతు తెలిపాయి. 

సమ్మెకు వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నేత ఏ నరేందర్‌ సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను చేపట్టాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు సమ్మెకు వాల్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు. కార్మికుల కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని.. అలాగే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈ సందర్భగా డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ రంగ రక్షణ, రైల్వే, బ్యాంకు, రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించరాదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

Trending News