Tragedy Incident: దేశ సేవలో నిమగ్నమైన సైనికుడు కావడంతో కుటుంబసభ్యులు ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ యువతి ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుంది. భారీగా కట్న కానుకలు ఇచ్చుకోవడంతోపాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా అసలు రూపం బయటపడింది. కట్నం డబ్బులు ఆలస్యమవడంతో భర్త, మామ వేధించసాగారు. దీనికితోడు ఆడపడుచులు 'అందంగా లేవు. లావుగా ఉన్నావు' అంటూ సూటిపోటీ మాటలతో వేధించడంతో ఆ నవ వధువు తట్టుకోలేకపోయింది. వేధింపులు.. అవమానాన్ని తట్టుకోలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది.
ఇది చదవండి: AP Real Estate: ఏపీలో రియల్ ఎస్టేట్‌కు బూస్ట్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం టకోయ్ గ్రామానికి చెందిన సంపతిరావు కుమార్తె నీరజాక్షి (21)కి పలాస మండలం ఈదురాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పైల వినోద్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన అనగా ఆరు నెలల క్రితం వివాహమైంది. వరకట్నంగా వినోద్‌కు రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. వివాహ సమయంలో రూ.10.50 లక్షల నగదు 10 తులాల బంగారం, ఇతర కానుకలు భారీగా ఇచ్చారు.
ఇది చదవండి: YS Sharmila: గౌతమ్ అదానీతో జగనన్న 'లంచం' ఒప్పందాన్ని రద్దు చేయండి
వివాహానంతరం ఉద్యోగరీత్యా వినోద్ తన భార్య నీరజాక్షిని తీసుకుని వెళ్లి ఢిల్లీలో కాపురం పెట్టాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో వరకట్నం చిచ్చు రేపింది. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వగ్రామమైన ఈదురాపల్లికి భార్యాభర్తలు వినోద్, నీరజాక్షి వచ్చారు. భర్త, మామ, ఆడపడుచులు ఇవ్వాల్సిన రూ.5 లక్షల కట్నం వెంటనే ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. ఇక ఆడపడుచులు అయితే 'అందంగా లేదు. లావుగా ఉంది. విడాకులు ఇచ్చేయి' అంటూ వినోద్‌పై ఒత్తిడి పెంచారు. నీరజాక్షిని వదిలిపెట్టాలని బలవంతం చేశారు.
ఇదే విషయంలో అవమానంతోపాటు మనస్తాపానికి లోనయిన నీరజాక్షి సోమవారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెబితే తానే ఉదయం వస్తానని తండ్రి చెప్పడంతో సోమవారం ఇంట్లోనే ఉండిపోయింది. కానీ సాయంత్రం వరకు వేధింపులు తాళలేక నీరజాక్షి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.
అయితే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడేంత స్థాయి కాదని.. మామ, భర్త, ఆడపడుచులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి సంపతిరావు ఆరోపణలు చేశాడు. ఈ సంఘటనపై మృతురాలి గ్రామస్తులు టకోయ్ వాసులు పెద్దఎత్తున చేరుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. నీరజాక్షి మృతికి కారణమైన భర్త, మామ, ఆడపడుచులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.