Game Changer Pre Release Event: సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన విడుదల కానున్న రామ్ చరణ్ తేజ సినిమా 'గేమ్ ఛేంజర్'కు సంబంధించి ముందస్తు విడుదల వేడుక (ప్రి రిలీజ్ ఈవెంట్)కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో సంధ్య థియేటర్ సంఘటన కాకుండా పోలీసులతోపాటు నిర్వాహకులు భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం జరగనున్న ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తుండడంతో వారికి పోలీసులు, నిర్వాహకులు కీలక సూచనలు చేశారు.
Also Read: Game Changer Trailer: 'గేమ్‌ఛేంజర్'లో రామ్ చరణ్ అన్నదమ్ముళ్లా.. తండ్రీకొడుకులా?
ఎన్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, కియారా అద్వానీ జోడీగా దిల్ రాజు నిర్మాణంలో 'గేమ్ ఛేంజర్' సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ విడుదల కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ తేజ బాబాయి పవన్ కల్యాణ్ రానుండడంతో పెద్ద స్థాయిలో మెగా అభిమానులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.
Also Read: Allu Arjun Bail: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
అభిమానులకు జాగ్రత్తలు
- వేడుకకు వచ్చే సమయంలో గందరగోళం చెందవద్దు.
- ఒకరినొకరు తోసుకోరాదు. క్రమ పద్ధతిలో వేడుకకు వెళ్లాలి.
- ఆలస్యమైనా తోసుకుంటూ వెళ్లరాదు.
- సినీ తారలు వచ్చిన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించరాదు.
- పోలీసులు.. నిర్వాహకులకు అభిమానులు సహకరించాలి.
- చిన్న ప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తంగా ఉండాలి.
ప్రి రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకతలు
- ఈవెంట్‌కు వెళ్లేందుకు అభిమానులు కోటగుమ్మం నుంచి భారీ ర్యాలీ.
- గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ ధరించిన పంచెకట్టు గెటప్‌లో చరణ్ అభిమానులు కనిపించనున్నారు.
- ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సినిమా వేడుకకు పవన్ కల్యాణ్ రానున్నారు.
- ఈ వేడుక మెగా హీరోలు, వారి కుటుంబసభ్యులు కూడా హాజరుకానున్నారు.
- సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అభిమానులకు ప్రత్యేక జాగ్రత్తలు సూచన
ఏర్పాట్లు పూర్తి
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి వేమగిరిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనుండడంతో అభిమానులు భారీగా రానున్నారు. ఎంత మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. స్టేజ్.. లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుక నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ పలుసార్లు వేడుక జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. లక్ష మందికి మాత్రమే గ్రౌండ్ వద్దకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. సంధ్య థియేటర్ సంఘటన నేపథ్యంలో అభిమానులు ఎవరి రక్షణ వాళ్లు చూసుకోవాలని ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు సూచించారు.
#GlobalStar @AlwaysRamCharan garu’s Fans wearing Appanna costume from #GameChanger and marching from kotagummam junction to Shyamala theatre#GameChangerPreRlseEventHungama pic.twitter.com/lNsf6RAOvx
— SivaCherry (@sivacherry9) January 3, 2025
Game changer pre release event Rajahmundry
Getting ready for tomorrow's blast
Get ready PK and RC fans and MEGA Fans 😎 #GameChanagerTrailer #GameChanager @GameChangerOffl pic.twitter.com/t6TURF8QRL— vijay naidu 🚁🦅 (@vijayna53258867) January 3, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook