Kadapa Mayor vs MLA Madhavi: కడప నగరపాలక సంస్థలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య రచ్చ కొనసాగుతోంది. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ కేటాయించకపోవడంతో కొన్ని వారాలుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మేయర్ కుర్చీ వేయలేదు. దీంతో మరోసారి కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమావేశం జరగకుండా టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్ జగనన్న అంటే అంత కోపమా?
సర్వసభ్య సమావేశంలో వేదికపై మేయర్ సురేశ్ బాబుకు మాత్రమే కుర్చీ వేయడంతో.. తనకు సీటు లేకపోవడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస తెలిపారు. అంతకుముందు భారీగా అనుచరులతో ఆమె ర్యాలీగా కడప కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద టీడీపీ నాయకులను పోలీసులు అడ్ఉడకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వాగ్వివాదం చోటుచేసుకుంది.
Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవి రడ్డి మధ్య కుర్చీలాట కొనసాగింది. వేదికపై ఎమ్మెల్యేకు సీటు వేయాలని ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గత సమావేశంలోనూ పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. ఎంతకీ వివాదం సద్దుమణగకపోవడంతో సభ వాయిదా పడింది. మహిళను గౌరవించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. అంతకుముందు మేయర్ పోడియాన్ని ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ మద్దతు కార్పొరేటర్లు చుట్టుముట్టారు.
ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం
మేయర్ సురేశ్‌బాబుకు మహిళలంటే చిన్నచూపు ఉందని.. అందుకే మహిళలను నిలబెట్టారు అని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో కుడి.. ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని గుర్తుచేసుకున్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టకపోవడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషపడవచ్చేమో.. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు అని చెప్పారు. మేయర్ కుర్చీలాట ఆడుతున్నారని.. విచక్షణాధికారం ఉందని విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవి ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook