Pandit insulted During Wedding ceremony in kakinada: మనలో చాలా మంది బ్రాహ్మణులను దైవంగా భావిస్తారు. అందుకే బ్రాహ్మణ వాక్కు బ్రహ్మ వాక్కు కూడా అని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో ఒకరు పుట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా జరుగుతాయి. ముఖ్యంగా హిందువులు ఇంట్లో ఏ శుభకార్యం చేసిన, వివాహా వేడుకలు, నామకరణం, బారసాల, అన్న ప్రాసన ఇలా ఏది చేసిన కూడా పండితులను అడిగే చేస్తుంటారు. కొత్త ఇల్లు కొన్న, వాహానం కొన్న కూడా ఆయన సూచనలు పాటిస్తు ముందుకు వెళ్తుంటారు. దేవతలందరు మంత్రాలకు ఆధీనులు,మంత్రాలు బ్రాహ్మణులకు ఆధీనంగా ఉంటాయి. అయితే.. బ్రాహ్మణులు అంత ఉన్నతంగా, ఎల్లప్పులు తమ మనస్సును దైవంమీద లగ్నం చేసుకుని ఉంటారు.
ఇంతటి దౌర్భాగ్యం అహ??? @jyothsna_tdp
ఇదే, వేరే మతం లో జరిగితే ఎలా ఉండేది???
బ్రాహ్మణులు అంటే ఇంత చులకన???
పెళ్లి లో బ్రహ్మ స్వరూపమైన పూజారి గారికి అవమానం
***********************************************
పెళ్లంటే బొచ్చె చేతిలో పెట్టుకుని భోజనాలు మెక్కడం , మందు పార్టీలు చేసుకోవడం… pic.twitter.com/0sWwbv3by5— Sai (@Sai1016171) April 20, 2024
వైదిక కార్యక్రమాలు చేసే పురోహితులు ముఖ్యంగా.. ఆ దేవుడిని ఎప్పుడు కూడా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. మనం పుట్టిన రోజు, పెళ్లిరోజని ఆలయానికి వెళ్లి ఆ పూజారీ ఆశ్వీర్వాదాలు తీసుకుంటాం. అలాంటి గొప్పస్థానంలో ఉన్న బ్రాహ్మణులను కొందరు పెళ్లి చేయడానికి ఆహ్వానించి మరీ అవమానం కలిగేలా ప్రవర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీన్ని హిందు బంధువులంతా ఖండిస్తున్నారు.
పూర్తి వివరాలు..
వెస్ట్ గోదావరి జిల్లాలోనిన కాకినాడ జిల్లాలో.. యు . కొత్త పల్లి గ్రామంలో ఇటీవల ఒక వివాహం జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమం జరిపించడానికి ఆచెల్ల సూర్యనారయణమూర్తి శర్మ ను ఆహ్వనించారు. పురోహితుడు పెళ్లి తంతు జరిపిస్తుండగా కొందరు ఆకతాయిలు ఆయను వేధించడం మొదలు పెట్టారు. ఆయనపై బ్యాగులు వేయడం, పసుపు కుంకుమ ప్యాకెట్లు వేయడం, వాటర్ ప్యాకెట్లు పాడేయటం వంటివి చేశారు. పురోహితుడు మాత్రం ఎన్నోసార్లు వారిని సున్నితంగా చెప్పేప్రయత్నం చేశారు. కానీ మరింత రెచ్చిపోయిన కేటుగాళ్లు ఆయనను ఆటపట్టించేలా ప్రవర్తించారు.
ఈ క్రమంలో ఆయన అంతజరుగుతున్న కూడా పెళ్లి తంతును ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ గా మారింది. దీని గురించి ఆరాతీయగా సదరు పురోహితుడు ఎంతో బాధతో.. తనకు జరిగిన అవమానంచెప్పుకుని బాధపడ్డారంట. ఆకతాయిలు చేసిన పనిపట్లు తీవ్రమైన మనోవేదనకు గురయ్యానని తెలిపారు. ఈ క్రమంలో దీనిపై బ్రాహ్మణ, విశ్వహిందు పరిషత్ సంఘాలు స్పందించాయి. వెంటనే ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter