RRR - Raghurama Krishnam Raju: 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు.. ఆ తర్వాత రెబల్‌గా మారి ప్రభుత్వం తిరుగుబాటు బావుటా ఎగరేసారు. అప్పటి నుంచి వీలైనపుడల్లా.. వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేస్తూ ఈయన వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఓ కూటమిగా ఎన్నికల రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో సీటు పంపిణిలో ఈ మూడు పార్టీల్లో ఎవరికీ నరసాపురం ఎంపీ స్థానం.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన రఘురామకు.. బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ సీటును భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఈయన నరసాపురం పార్లమెంట్ స్థానంలో గత 30 యేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తోన్నారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో రఘురామ తనకు ఎంపీ టికెట్ రాకుండా.. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీతో కలిసి కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేసారని ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎంపీ టికెట్ దక్కించుకున్న శ్రీనివాస వర్మ ఒక్కరే అసలు సిసలు బీజేపీ నేత అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇక బీజేపీ పోటీ చేస్తోన్న 5 ఎంపీ సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే బీజేపీ కట్టబెట్టరన్న చర్చ నడుస్తోంది. ఇక రఘురామ బీజేపీ టికెట్ ఆశించినట్టైయితే.. ముందుగా ఆ పార్టీలో చేరితే బాగుండేది.
అలాందేమి లేకుండా.. కూటమిలో ఎవరికీ ఆ సీటు కేటాయిస్తే.. ఆ పార్టీ తరుపున పోటీ చేస్తానని చెప్పడం రఘురామ టెంపరితనానికి నిదర్శమని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న నమ్మకం తనకు ఉందంటూ కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు రఘురామ. ఏ పార్టీయో తెలియదు కానీ.. ఎమ్మెల్యేగానే.. ఎంపీగానో తెలియదు.. నాలుగైదు రోజుల్లో మంచి వార్త వింటారని చెప్పారు. ఈ సందర్భంగా రఘురామ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు అక్కడ స్థానిక తెలుగు దేశం నేతలు స్వాగతం పలికారు.
Also Read: Pawan Kalyan Fever: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook