Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Anakapalli Reactor Blast: అచ్యుతాపురంలో ఫ్మార్మా కంపెనీ పేలుడులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 18 మంది చనిపోయారు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఫ్మాక్టరీస్‌ విభాగం ఓ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

Written by - Renuka Godugu | Last Updated : Aug 22, 2024, 08:39 AM IST
Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన రియాక్టర్‌ పేలుడులో 18 మంది వరకు చనిపోయారు. అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపింది. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు.

ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? అని రెస్క్యూ టీమ్‌వారు కూడా కృషి చేస్తున్నారు. అయితే, రాత్రి నుంచి భారీవర్షాలు కురవడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అంతేకాదు శిథిలాల కింద దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ తెలుసుకుంటున్నారు. హోం మంత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ప్రకటించారు. 

ఇదీ చదవండి: పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..

ఈరోజు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శనించనున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించమని అవసరమైతే ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించాలని అధకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే భారీ క్రెయిన్లను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌, అగ్నిమాప సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రితోపాటు స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 

ఇదీ చదవండి: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?

అసలు ప్రమాదం ఎలా జరిగింది..?
అచ్యుతాపురంలో ఫ్మార్మా కంపెనీ పేలుడులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 18 మంది చనిపోయారు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఫ్మాక్టరీస్‌ విభాగం ఓ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం మిథైల్‌ టెర్ట్‌ బ్యుటైల్‌ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మారుస్తుండగా లీకై ఆవిరిగా మారింది. అది వాతావరణ రసాయనాలతో ప్రతిస్పందించి ఆ మిశ్రమం ఎలక్ట్రిక్‌ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News