Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాం

Adudam Andhra Event Corruption: జగన్‌ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 23, 2024, 04:38 PM IST
Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాం

Adudam Andhra Event: గత ప్రభుత్వంలో అట్టహాసంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ చేస్తామని ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతుతోంది. తాజాగా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మరోసారి అదే విషయాన్ని ప్రకటించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం పనికిమాలిన ప్రోగ్రామ్‌ అని విమర్శించారు. ఆ శాఖ మంత్రిగా ఉన్న రోజా చేసిన అవినీతిని కక్కిస్తామని ప్రకటించారు.

Also Read: Free Bus Scheme: ఏపీ మహిళలకు సూపర్బ్‌ న్యూస్‌.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే..

 

అమరావతిలోని సచివాలయంలో ఆదివారం రవాణా, క్రీడల, యువజన సేవల శాఖ మంత్రిగా మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో ₹18.51 కోట్ల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవని.. భద్రత అనేది చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కృషి చేస్తానని చెప్పారు. రెండు మూడు నెలల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. త్వరలో  కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులో  రానున్నాయని పేర్కొన్నారు. మహిళల కోసం  ఉచిత బస్సు  ప్రయాణం త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.

Also Read: AP Govt Schemes: వైఎస్సార్‌, జగన్‌ పేర్లు తొలగింపు.. పథకాల పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

'క్రీడా పరంగా భారతదేశం ఎంతో వెనుకంజలో ఉంది. గత ప్రభుత్వం యువతకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖలో జరిగిన అవినీతిని విచారణ చేసి కక్కిస్తాం' అని మంత్రి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. 

ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం సౌకర్యంలో ఎదురయ్యే లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నాం' అని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News