Shaik Rasheed: షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, డిగ్రీ పూర్తవ్వగానే ఆ ఉద్యోగం!

Shaik Rasheed, CM YS Jagan Meet: టీమిండియా యువ జట్టు అండర్‌-19 ప్రపంచ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన.. భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టుకు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ను సీఎం వైఎస్‌ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. అతని గ్రాడ్యుయేషన్‌ పూర్తవ్వగానే.. ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 08:22 PM IST
  • సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీమిండియా అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌
  • షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్
  • ప్రభుత్వం‌ తరఫున పలు ప్రోత్సాహకాలు
  • 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రదానం
  • గ్రాడ్యుయేషన్‌ పూర్తవ్వగానే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం
Shaik Rasheed: షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, డిగ్రీ పూర్తవ్వగానే ఆ ఉద్యోగం!

Shaik Rasheed Meets AP CM YS Jagan: టీమిండియా అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశాడు. భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్‌ రషీద్‌ను సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 

ఏపీ సర్కార్‌‌ తరఫున పలు ప్రోత్సాహకాలను అలాగే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. గుంటూరులో నివాస స్ధలాన్ని కేటాయించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హమీ ఇచ్చారు. 

ఇక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్‌ను సీఎం జగన్‌ చేతుల మీదుగా షేక్‌ రషీద్‌ అందుకున్నారు. షేక్‌ రషీద్‌ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. 

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రషీద్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. 17 ఏళ్ల ఈ కుర్రాడు.. టీమిండియా యువ జట్టు ఆసియా కప్‌ చేజిక్కించుకోడంలో, అలాగే అండర్‌ 19 ప్రపంచ కప్‌ను ఐదోసారి గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 

షేక్‌ రషీద్‌కు గ్రాడ్యుయేషన్‌ పూర్తవ్వగానే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సంబంధింత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

షేక్‌ రషీద్‌ అభినందన కార్యక్రమంలో ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్‌ తండ్రి బాలీషా, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, శాప్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: IND vs WI 1st ODI LIVE*: రవి బిష్ణోయ్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పయిన విండీస్!!

Also Read: BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News