Avinash Reddy Anticipatory Bail Petition: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. తన తల్లి అనారోగ్యం కారణంగా మరో వారం రోజులుగా సీబీఐ అరెస్ట్ చేయకుండా మరో వారం రోజులు సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఈ నెల 25వ తేదీన హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది. అదేరోజున విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. దీంతో హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఎల్లుండి విచారణకు రానుంది. దీంతో ఏం జరుగుతోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గుండె సంబంధిత సమస్యలతో తన తల్లి శ్రీలక్ష్మి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె కోలుకోవడానికి వారం రోజులు సమయం పడుతుందని.. అప్పటి వరకు సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి లాయర్లు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పి.నరసింహ ధర్మాసనం ఈ నెల 25 హైకోర్టులోని వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది.
అంతకుముందు ఎంపీ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సుప్రీంలో వాదనలు వినిపించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడు సార్లు హాజరయ్యారని చెప్పారు. విచారణకు ఆయన సహకరించారని.. ఈ కేసులో ఎంపీ నిందితుడి కాదని వాదించారు. ఈ కేసులో ఎంపీ తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసిందని.. ఎంపీ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ పిటిషన్‌పై వైఎస్ సునీతా లాయర్లు వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. తాము కేసు మెరిట్స్ లోపలకు వెళ్లడంలేదని ధర్మాసనం నిరాకరించింది.
ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు రెడీ అయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందవే. తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు దూరమైన అవినాష్ రెడ్డిని ఆసుపత్రిలోనే అరెస్ట్ చేస్తారంటూ రెండు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సీబీఐ అధికారులు కర్నూలుకు వెళ్లడం.. అక్కడ ఎస్పీతో మాట్లాడడం అరెస్ట్ తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. వైసీపీ శ్రేణులు విశ్వభారతి ఆసుపత్రి వద్ద భారీగా మోహరించగా.. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!
Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి