Actor Ali: వైసీపీని వీడే ప్రసక్తే లేదు..సీఎం వైఎస్ జగనే నా నేత: ఆలీ..!

Actor Ali: వైసీపీ నేత, సినీ నటుడు ఆలీ పార్టీ మారబోతున్నారా..? పదవులు ఆశించి భంగ పడ్డారా..? అందుకే పార్టీ మారబోతున్నారా..? దీనిపై ఆయన ఏమంటున్నారు..?

Written by - Alla Swamy | Last Updated : Sep 28, 2022, 08:05 PM IST
  • ఆలీ పార్టీ మారబోతున్నారా..?
  • జనసేనలో చేరడం ఖాయమేనా..?
  • స్పందిచన సినీ నటుడు
Actor Ali: వైసీపీని వీడే ప్రసక్తే లేదు..సీఎం వైఎస్ జగనే నా నేత: ఆలీ..!

Actor Ali: తాను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత, సినీ నటుడు ఆలీ స్పందించారు. సోషల్ మీడియా వస్తున్న కథనాలను ఖండించారు. ఇదంతా తప్పుడు వార్తేనని స్పష్టం చేశారు. కొందరు తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పదవులు, ప్రయారిటీల కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకే పార్టీలో చేరారని తెలిపారు.

పదవులు ముఖ్యం కాదని..జగన్‌ మనసులో స్థానం పొందడం ముఖ్యమన్నారు. మరోసారి వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు ఆలీ. ఏ సీఎం చేయని విధంగా మైనార్టీలకు సీఎం జగన్ చేశారని గుర్తు చేశారు. మైనార్టీల కోసం ఎంతో చేశారని తెలిపారు. అన్నివర్గాల వారికి కేబినెట్‌ స్థానం కల్పించారని..నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీని ఎలా వదులుకుంటానని చెప్పారు.

సినీ నటుడు ఆలీ..వైసీపీని వీడుతారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు పార్టీలో సముచిత స్థానం లేదన్న ప్రచారం జరిగింది. రాజ్యసభ పదవి ఆశించి భంగపడ్డారని తెలుస్తోంది. దీని వల్లే ఆలీ పార్టీకి దూరంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో యాక్టివ్‌గా కనిపించారు. తర్వాత ఆయన జాడ కనిపించలేదు. దీంతో ఆలీ పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. పవన్ సినిమాలో కచ్చితంగా ఆలీ ఉంటారు. వారిద్దరి స్నేహం వల్లే జనసేనలో చేరుతారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని పవన్ సైతం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు గానీ..పార్లమెంట్ సీటు గానీ ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈనేపథ్యంలోనే వైసీపీ నుంచి జనసేనలోకి ఆలీ వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయన మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Also read:China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం..!

Also read:CM Jagan: ఆ 27 మంది పని తీరు మార్చుకోవాలి..నేతలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News