వైసీపీ అధినేత జగన్ దాడి కేసుకు సంబంధించిన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు దీనిపై ఈ రోజు విచారణ చేపట్టనుంది. కోడికత్తి దాడి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేని విధంగా కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు., ఏపీ డీజీపీతో సహా 8 మందిని ప్రతివాదులగా తేల్చారు. జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం..ఇప్పటికే ఈ కేసులో 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో ప్రతివాదులు ఏ మేరకు తమ వాదనలు వినిపిస్తారు..దీని న్యాయస్థానం ఎలా స్పందిస్తోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.