న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ(హెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక విద్యాసంస్థలు మెరుగైన ర్యాంకులను సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. కళాశాల లేదా వర్శిటీలోని విద్యాప్రమాణాలకంటే కూడా పరిశోధనలకు గల అవకాశాలు, ప్రోత్సాహాల్నే ప్రధానాంశంగా తీసుకుని ఈ సారి కేంద్ర మానవవనరులశాఖ ఈ ర్యాంక్‌లు నిర్ణయించింది. వర్శిటీల ప్రాతిపదికగా కాకుండా విభాగాల వారీగా కూడా ఈసారి ర్యాంక్‌లు ప్రకటించింది.
జాతీయస్థాయిలో బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) ఈసారి మొదటి స్థానాన్ని సాధిస్తే.. వైద్య కళాశాలల జాబితాలో ఢిల్లిలోని ఆలిండియా ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని 10 అత్యుత్తమ న్యాయ విద్యాలయాల్లో విశాఖలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా పదోస్థానాన్ని పొందింది.
ఓవరాల్ కేటగిరిలో.. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 11, హైదరాబాద్ ఐఐటీ 22, ఆంధ్రా యూనివర్శిటీ 36, ఉస్మానియా యూనివర్శిటీ 45, శ్రీవెంకటేశ్వర యునివర్సిటీ-ఎస్వీయూ 74వ స్థానంలో నిలిచాయి. వరంగల్ నిట్ 78వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య(కేఎల్) యూనివర్శిటీ 83వ స్థానంలో, తిరుపతి స్విమ్స్ 89వ స్థానంలో నిలిచాయి.
అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితాలో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి 5 స్థానం, ఆంధ్రా యునివర్సిటీ (ఏయూ)కి 22, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కు 28, శ్రీవెంకటేశ్వర యునివర్సిటీ(ఎస్వీయూ)కు 49, స్విమ్స్‌కు 62, పిజెటిఎస్ఎయూకు 82, గీతం వర్శిటీకి 85, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీకి 98వ ర్యాంకు, శ్రీ సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ కి 92వ ర్యాంకు దక్కాయి.
అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో.. హైదరాబాద్ ఐఐటీకి 9, నిట్‌కు 25, ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌కు 38, జెఎన్టియయూహెచ్కు 42, కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీకి 49, ఏయూసిఇకి 65, ఎస్వీయూకు 71, ఏయూ క్యాంపస్ 65, శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ 71, యూసిఇహెచ్కు 80, సాగి రామకృష్ణంరాజుకి 85, జేఎన్టీయూ కాకినాడకి 97వ ర్యాంకు దక్కాయి.
డిగ్రీ కాలేజీల్లో.. కర్నూలు సిల్వర్ జూబ్లీకి 35వ ర్యాంకు, విజయవాడ ఆంధ్రా లయోలాకి 56వ స్థానం దక్కాయి.
ఎంబీఏలో.. సత్యవేడు ఐఎఫ్ఎంఆర్కి 34, కేఎల్‌కి 46వ స్థానాలు.. ఫార్మసీలో అంధ్రా వర్సిటీ కళాశాలకు 28, అనంతపురం రాఘవేంద్ర కళాశాలకు 39వ ర్యాంకులు దక్కాయి.