YS Jagan Mohan Reddy Vs TDP: భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అయింది. గతంలో ఎన్నడూ ఎదుర్కొని ప్రకృతి విపత్తును నగర ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సాయంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతోనే విజయవాడలో వరదలు వచ్చాయని ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా.. ఇంకా ప్రజలు నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు. జగన్ ట్వీట్‌కు టీడీపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేశారా..? లండన్‌లో ఉండి వేశారా..? అంటూ కౌంటర్ ఇచ్చింది. ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు..? అని ప్రశ్నించింది.
Also Read: AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
జగన్ ఏమన్నారు..?
విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా బాధితులకు ఇంకా దారీ తెన్నూ లేకుండా పోయిందన్నారు జగన్. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని.. ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వరదల కంటే చంద్రబాబు అసమర్థత వల్ల భారీ నష్టం వచ్చిందన్నారు. గతంలో 50 మందికిపైగా చనిపోవడం ఎప్పుడూ జరగలేదని.. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా.. వర్షాలు లేక నాలుగైదు రోజులు అవుతున్నా ప్రజలు ఇంకా నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు. ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని ముందే అలర్ట్ వచ్చినా.. పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ముందుగా అధికారులతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు.
చంద్రబాబు ప్రచార ఆర్బాటాలతో సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం నెలకొందని జగన్ అన్నారు. లక్షల ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఏమైపోయింది..? అని ప్రశ్నించారు. బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని.. తమ ప్రభుత్వంలో వరద బాధితులకే కాకుండా.. వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా రేషన్ సరుకులను ఒక్కరోజులో ఎండీయూ వాహనాల్లో డోర్ డెలివరీ చేశామన్నారు. విజయవాడలో విషమ పరిస్థితులు ఉన్నా.. ప్రభుత్వం ఇస్తున్న సరుకులు అరకొరేనని అన్నారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా సాయం అందించాలని.. ప్రభుత్వం ఆదుకోకపోతే పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ కౌంటర్ ఇలా..
సీఎం చంద్రబాబు సమర్ధతతో, ఒక్కఈ ఒక్క రోజులో మూడు పూటలా కలిపి 8 లక్షల మందికి ఆహారం అందించామని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. మంచి నీళ్ళు, పాలు వీటికి అదనం. ఇప్పటికే 66,454 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల కిట్ పంపించామని స్పష్ట చేసింది. "మూడు రోజుల్లో కాదు, రెండు గంటల్లో 40 సెం.మీ వర్షం పడింది. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ప్రజలు చక్కగా సహాయక శిబిరాల్లో ఉన్నారు. అన్ని సౌకర్యాలు వారికి అందుతున్నాయి. బెంగుళూరులో ఉండే నీకు ఇలాంటివి తెలిసే అవకాశం లేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది..? నీ 5 ఏళ్ళ చేతకాని తనం, నీ డబ్బు పిచ్చ వల్ల జరిగింది. ఏడాది క్రితం బుడమేరుకి గండి పడితే నిద్ర పోయావ్. బుడమేరు గట్టు పై మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నావ్. బుడమేరు ఆక్రమించి, ఫ్లాట్లు చేసుకుని అమ్ముకున్నావ్. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బుడమేరు ఆధునీకరణ పనులు ఆపేసావ్. బుడమేరు పేరుతో రూ.500 కోట్లు వెనకేసావ్.
శుక్రవారం రాత్రి వర్షం పడితే, శనివారం ఉదయానికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. NDRF, ఆర్మీ లాంటి వాళ్ళే ఆ వరదలో వెళ్ళలేని ప్రతికూల పరిస్థితి ఉంటే, వాలంటీర్లు ఎలా వెళ్తారు..? బురద చల్లటం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బ్రతుకు. మేము ఎలాంటి సరుకులు ఇస్తున్నామో, నువ్వు ఎలాంటి సరుకులు ఇచ్చావో ప్రజలు గమనిస్తున్నారు. నీ లాగా ఒక టమాటా, ఒక బంగాళదుంప ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు మాది. నీ ఘనకార్యాలు గత 5 ఏళ్ళు చూసాం కదా.." అని ఘాటుగా జగన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.
Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.