Pay Revision Commission: తొమ్మిది నెలల చంద్రబాబు పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన సవరణ సంఘం, గొప్పగా చెప్పి ఒకటో తేదీన వేతనాల చెల్లింపు వంటివి ఎక్కడా? అని నిలదీశారు. ఉద్యోగులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోగా 2 లక్షల వాలంటీర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
తాడేపల్లిలోని తన నివాసంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. పలు అంశాలను ప్రస్తావిస్తూనే ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్స్, ఒకటో తేదీన వేతనాల చెల్లింపు వంటి అంశాలను లేవనెత్తారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో నోరు పెట్టడమేనని అభివర్ణించారు. చంద్రబాబు చేసిన రూ.1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయని నిలదీశారు.
Also Read: Upasana Konidela: పవన్ కల్యాణ్ కోడలు సంచలన నిర్ణయం.. పిఠాపురం నుంచే 'ఆ పనికి' శ్రీకారం
'ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 'ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు' అని గుర్తుచేశారు.
'ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అని చెప్పి ఉన్న పీఆర్సీ ఛైర్మన్‌ను పంపించేశారు. ఇంకెక్కడ పీఆర్సీ?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏ నెలలో కూడా ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎవరికి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్థిక విధ్వంసమని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 లేదు.. సూపర్ 7 లేదంటూ ప్రస్తావించారు. చీటింగ్‌లో సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఆవిరవుతోందని.. నటనలో ఆయనకు అవార్డు ఇవ్వాల్సిందేనని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.