7th Pay Commission DA Hike: కొత్త ఏడాదికి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా జనవరిలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు మార్గం సుగమమైంది. కొత్త ఏడాదికి ముందే కేంద్ర ఉద్యోగుల డీఏ పెంచేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు నెలకు సంబంధించిన AICPI ఇండెక్స్ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రతి నెలా చివరి పనిదినం నాడు AICPI గణాంకాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
1.2 పాయింట్ల పెరుగుదల
సెప్టెంబర్ 2022తో పోలిస్తే.. అక్టోబర్‌లో AICPI ఇండెక్స్ ఫిగర్‌లో 1.2 పాయింట్ల పెరుగుదల ఉంది. సెప్టెంబర్‌లో 131.3 శాతంగా ఉంటే అక్టోబర్‌లో 132.5 స్థాయికి పెరిగింది. అంతకుముందు ఆగస్టులో ఈ సంఖ్య 130.2 పాయింట్లుగా ఉంది. జూలై నుంచి ఇందులో స్థిరమైన పెరుగుదల ఉంది. నిరంతర పెరుగుదల కారణంగాజజ కొత్త సంవత్సరం జనవరిలో నిర్వహించే 65 లక్షల మంది ఉద్యోగుల డీఏ పెంపు దాదాపు ఒకే అయింది. దీని ఆధారంగా ఉద్యోగుల డీఏలో కచ్చితంగా 4 శాతం పెంపుదల ఉండే అవకాశం ఉంది.
జూలైలో డీఏను 4 శాతం పెంచిన తర్వాత కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి పెరిగింది. ఇప్పుడు మళ్లీ 4 శాతం పెరిగితే.. 42 శాతానికి చేరనుంది. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉండనుంది. ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగుల డీఏను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, జూలై నెలలో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు జనవరి 2023లో కొత్త డీఏను ప్రకటించనుంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెండింగ్ డీఏపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కరోనా సమయంలో నిలిపేసిన 18 నెలల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు పోరాడుతున్నారు. పెండింగ్‌లో డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల ఖాతాల్లో రూ.2 లక్షలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Viral Leave Letter: మా అమ్మ 5న చనిపోతది.. సెలవులు కావాలి! వైరల్ అవుతోన్న టీచర్స్ లీవ్ లెటర్స్
Also Read: Shraddha Walker Case: శ్రద్ధా తల ఎక్కడ? ఆమె ఫోన్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook