Airtel 5G Recharge Plan 2023 List: టెలికాం దిగ్గజం ' భారతీ ఎయిర్‌టెల్' డిసెంబర్ 2023 నాటికి ప్రతి ప్రధాన నగరంలో 5G సేవను ప్రారంభించాలనుకుంటోంది. ఇప్పటివరకు 300 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ని తీసుకొచ్చింది. రాబోయే వారంలో పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 5G సేవను ఉచితంగా అందించడం లేదు. కొన్ని ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మాత్రమే 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ 5 ప్లాన్‌లలో ఉచిత అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Airtel Rs 499 plan:
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్ 28 రోజుల వాలిడిటీని అందిస్తుంది. దీనిలో 5G ఇంటర్నెట్‌తో ప్రతిరోజూ 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా 3 నెలల డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. అదే సమయంలో ఎక్స్‌ట్రీమ్ యాప్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 5G లేని వినియోగదారులు 3GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ ఉంటుంది.
Airtel Rs 839 plan:
రూ. 839 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇందులో అపరిమిత 5G ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్ మరియు 100 SMSలు ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో 3 నెలల డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. 5G సేవను ఆస్వాదించలేని వారికి ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్లో రోజువారీగా 2GB 4G డేటాను వాడుకోవచ్చు.
Airtel Rs 3359 plan:
రూ. 3359 ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో అపరిమిత 5G డేటా, కాలింగ్ మరియు రోజువారీ 100 SMSలు ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా Apollo 24x7 ప్రయోజనాలు, Wynk సబ్‌స్క్రిప్షన్ మరియు మరెన్నో వినియోగించుకోవచ్చు.
Airtel Rs 699 plan:
రూ.699 ప్లాన్ 56 రోజుల వాలిడిటీని ఇస్తుంది. ఇందులో అపరిమిత 5G డేటా, కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 56 రోజుల పాటు ఉంటుంది. వినియోగదారులు 5G నెట్‌వర్క్ ప్రాంతంలో లేకుంటే.. 3GB 4G డేటాను వాడుకోవచ్చు.
Airtel Rs 999 plan:
రూ. 999 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా మరియు 100 SMS ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. Airtel 5G సిటీలో లేని వినియోగదారులు రోజువారీగా 2.5GB 4G డేటాను ఉపయోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.