Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్​- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ధరలు!

మీరు అమెజాన్ ప్రైమ్ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్​. త్వరలో ప్రైమ్​ మెంబర్​షిప్ ధరలు పెరగనున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 06:31 PM IST
  • అమెజాన్ ప్రైమ్​ యూజర్లకు బ్యాడ్ న్యూస్​
  • 50 శాతం పెరగనున్న ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్ ధరలు
  • అన్ని రకాల ప్లాన్స్​కు వర్తింపు!
Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్​- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ధరలు!

Amazon to hike Prime Plan Prices: ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాకిచ్చింది. ఇండియాలో ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే.. కొత్త ధరలు దాదాపు 50 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది.

కొత్త ధరలు ఎప్పటి నుంచి (Amazon prime new plan prices) అందుబాటులోకి వస్తాయనే విషయంపై కంపెనీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఈ-కామర్స్​ మార్కెట్​ వర్గాల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం నడుస్తున్న 'అమెజాన్ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​' సేల్ ముగిసిన తర్వాత కొత్త ప్లాన్స్​ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. దీనిపై అమెజాన్ ఇండియా త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

ప్రస్తుత ధరలు ఇలా..

దేశీయ యూజర్లకు వార్షిక సబ్​స్క్రిప్షన్​ ప్రస్తుతం (Amazon prime prices) రూ.999కు లభిస్తోంది. నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ రూ.129గా ఉంది. ఇక మూడు నెలల చందా రూ.329గా కొనసాగుతోంది.

కొత్త ప్లాన్స్​ ఇవే..

త్వరలో యూన్యువల్​ సబ్​స్క్రిప్షన్ (Amazon price new plans)​ రూ.1,499కి పెరగనుంది. మంథ్లీ ప్లాన్​ రూ.179గా చేరనుంది. మూడు నెలల ప్లాన్​ రూ.459కి పెరగనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

స్టూడెంట్స్​కు ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్స్​, టెలికాం ఆపరేటర్లతో కలిసి ఇచ్చే ప్రమోషనల్​ ఆఫర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

Also read : India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి

ఆటో రెన్యువల్​ లేదు..

అయితే కొత్త ప్లాన్స్​ తీసుకొస్తున్న నేపథ్యంలో యూజర్లకు కీలక సూచనలు చేసింది అమెజాన్ ఇండియా. ఇప్పటికే ప్రైమ్​ వాడుతున్న వినియోగదారుల గడువు ముగిసి అకౌంట్​లో కార్డ్స్ సేవ్ (డెబిట్​, క్రెడిట్​ కార్డ్స్​)​ అయ్యి ఉన్నా.. సబ్​స్క్రిప్షన్​ ఆటో రెన్యువల్ అవదని స్పష్టం చేసింది. కొత్త ధరలతో సబ్​స్క్రిప్షన్ తీసుకోవాలా? వద్దా? అనేది.. పూర్తిగా యూజర్ల ఇష్టమేనని వివరించింది.

Also read :  యాక్సిస్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్, 12 నెలలు ఈఎంఐ మాఫీ

ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​తో ఉపయోగలేమిటి?

సాధారణ యూజర్లతో పోలిస్తే.. ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ ఉన్న వినియోగదారులకు పలు వెసులుబాటులు అందిస్తుంటుంది (Amazon prime benefits) అమెజాన్. ముఖ్యంగా పండుగలు, ఇతర సమయాల్లో నిర్వహించే స్పషల్​ సేల్స్​​ విషయంలో ప్రైమ్ యూజర్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. అంటే.. ఏదైనా సేల్ ప్రారంభిస్తే కనీసం ఒకరోజు ముందుగానే ప్రైమ్​ యూజర్లకు ఆ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

సాధారణ యూజర్లకన్నా ప్రైమ్​ వినియోగదారులకు ఆర్డర్​ డెలవరీ వేగంగా ఉంటుంది. డెలివరీ ఛార్జీలు కూడా ఉండవు. కొన్ని సార్లు కేవలం ప్రైమ్ యూజర్ల కోసమే సేల్​ కూడా నిర్వహిస్తుంటుంది అమెజాన్​. వీటన్నింటితో పాటు.. ప్రైమ్​ వీడియో యాప్​లో సినిమాలు, వెబ్ సిరీస్​లను స్ట్రీమ్​ చేసేందుకు వీలుంటుంది. ప్రైమ్ మ్యూజిక్, గేమింగ్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.

Also Read: Fuel Price Hiked: దేశవ్యాప్తంగా ఆల్​టైం హైకి పెట్రోల్ రేట్లు- ప్రస్తుత ధరలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News