TOP CNG Cars: 10 లక్షల్లోపు ధరలో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే

TOP CNG Cars: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రత్యామ్నాయం వైపు అందరూ చూస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో 10 లక్షల బడ్జెట్‌లో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఏమున్నాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2024, 06:37 AM IST
TOP CNG Cars: 10 లక్షల్లోపు ధరలో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే

TOP CNG Cars: ఇటీవలి కాలంలో మార్కెట్‌లో సీఎన్జీ, ఈవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్-డీజిల్ ధరల పెరగుదలే ఇందుకు కారణం. అన్నింటికంటే ఎక్కువగా సీఎన్జీవైపు మొగ్గు చూపిస్తున్నారు. సీఎన్జీ అయితే అవసరమైనప్పుడు పెట్రోల్‌తో కూడా నడిచే డ్యూయల్ సదుపాయం కలిగి ఉంటాయి. మరి బడ్జెట్ సంగతేంటనే ప్రశ్న వస్తోంది. అందుకే 10 లక్షల బడ్జెట్‌లోపు లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది మీరే నిర్ణయించుకోవచ్చు

టాటా టిగోర్ సీఎన్జీ

టాటా టిగోర్ సీఎన్జీ వాస్తవానికి ఒక కాంపాక్ట్ సెడాన్ కారు. ఇందులో సీఎన్జీ పవర్ ట్రెయిన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సౌలభ్యం ఉంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 8.85 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేకుండా అయితే 7.75 లక్షల నుంచే మొదలవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయితే ధర ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. 

మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ

దశాబ్దాల తరబడి అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ మారుతి సుజుకి. మారుతి బ్రెజా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. 1.5 లీటర్ ఇంజన్ కలిగిన సీఎన్జీతో నడిచే కారు ఇది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేసిక్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ధర 9.29 లక్షలుగా ఉంది. 

హ్యుండయ్ ఎక్స్‌టర్ సీఎన్జీ

హ్యుండయ్ ఎక్స్‌టర్ అనేది ఎస్‌యూవీ విభాగంలో వెన్యూ కంటే కాస్త తక్కువకు లభించే మైక్రో ఎస్‌యూవీ. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్ వేరియంట్ ఒకటైతే, ఎస్ఎక్స్ వేరియంట్ మరొకటి. హ్యుండయ్ ఎక్స్‌టర్ సీఎన్జీ ఎస్ వేరియంట్ ధర 8.43 లక్షలు కాగా ఎస్ఎక్స్ వేరియంట్ ధర 9.16 లక్షలుగా ఉంది. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ

మారుతి సుజుకి కంపెనీకు చెందిన క్రాసోవర్ ఇది. ఇటీవలి కాలంలో క్రేజ్ పెరుగుతోంది. బలేనో మాదిరి ప్లాట్ ఫామ్ కలిగి ఉంటుంది. సీఎన్జీ పవర్ ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో డెల్టా, జీటా రెండు వేరియంట్లు ఉన్నాయి. డెల్టా వేరియంట్ ధర 8.46 లక్షలు కాగా, జీటా వేరియంట్ ధర 9.32 లక్షలుగా ఉంది. 

టాటా పంచ్ సీఎన్జీ

టాటా పంచ్ ఇండియన్ మార్కెట్‌లో సక్సెస్ అయిన కారు. టాటా మోటార్స్ ఎస్‌యూవీ కార్ల విభాగంలో నెక్సాన్ కంటే తక్కువ శ్రేణికి చెందింది. టాటా పంచ్ సీఎన్జీ ప్యూర్, అడ్వెంచర్ వేరియంట్లలో లభిస్తోంది. టాటా పంచ్ సీఎన్జీ ధర 7.23 లక్షల నుంచి ప్రారంభమై 9.85 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది. 

Also read: Maruti Suzuki Swift 2024: 25.75kmpl మైలేజీతో కొత్త మోడల్‌ Swift 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News