Union Budget 2024:కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ పైన అన్ని రంగాలకు చెందినవారు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ఈసారి పెద్ద ఎత్తున బడ్జెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి మధ్యతరగతికి చెందిన వారిపై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి పలు పథకాలకు నిధులు పెంచడం లబ్ధిదారులకు అదనపు లబ్ధి చేకూర్చడము వంటి కార్యక్రమాలు ఈసారి బడ్జెట్లో కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా పెన్షన్ గ్యారెంటీ మొత్తాన్ని 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ గ్యారెంటీ మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచే అవకాశం ఉందని ఇప్పటికే పలు బిజినెస్ మ్యాగజైన్లు పేర్కొంటున్నాయి.అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులుగా ఉన్నారు.ఈ పథకాన్ని తొలిసారిగా 2015వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.ఈ పథకం ప్రకారం కార్మికులకు ప్రతి నెల పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది.ఈ పథకం ప్రారంభంలో 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ గ్యారెంటీగా ప్రవేశపెట్టారు. ఈ పథకంలో చేరేందుకు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కార్మికులు అర్హతగా కలిగి ఉన్నారు.అయితే ఇప్పటికే ఈ పథకంలో దాదాపు 6.50 కోట్ల మంది చేరారు.
Also Read : HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!
ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది.గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో దాదాపు 1.22 కోట్ల మంది చేరినట్లు పిఎఫ్ఆర్‌డిఏ సంస్థ పేర్కొంది.అయితే ప్రస్తుతం ఈ పథకం కింద 5000 రూపాయల వరకు గరిష్ట మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది ఈ మొత్తాన్ని రూ.10వేల రూపాయలకు పెంచాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు ప్రచురితం అవుతున్నాయి.అయితే ఈసారి కేంద్ర బడ్జెట్లో అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి