EPFO Online: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. మే 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3వ తేదీతో గడువు ముగిసిపోగా.. చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గడువు పొడగించింది. సెప్టెంబరు 1, 2014లోపు ఈపీఎస్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులు పెన్షన్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటును పొందారు.
ఈపీఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సెప్టెంబరు 1, 2014 కంటే ముందు ఈపీఎస్ ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ కోసం దరఖాస్తు చేయకుండా మినహాయించినట్లు పేర్కొంది. దీని తర్వాత ఈ ఏడాది జనవరి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3 ఉండగా.. ఉద్యోగులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల అభ్యర్థన మేరకు ఈ గడువు ఇప్పుడు మే 3 వరకు పొడిగించారు.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం పింఛన్ గరిష్ట పరిమితి రూ.15,000 మాత్రమే. అంటే ఒక వ్యక్తి జీతం రూ.50 వేలు అయినప్పటికీ.. లిమిట్ అంతే ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. సెప్టెంబర్ 1, 2014 వరకు ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బేసిక్ శాలరీలో 8.33 శాతం డిపాజిట్ చేయడం ద్వారా ఇప్పుడు పెన్షన్ పొందవచ్చు. ఇప్పుడు 15 వేల పరిమితి ముగిసింది. మీరు కూడా ఈ అధిక పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. మీరు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి..?
==> దరఖాస్తు చేయడానికి ఈపీఎస్ సభ్యుడు సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాలి.
==> దరఖాస్తు ఫారమ్‌తో పాటు.. అవసరమైన అన్ని పత్రాలను అక్కడ సమర్పించాలి.
==> దీనితో పాటు జాయింట్ ఆప్షన్లో డిస్క్లైమర్, డిక్లరేషన్ ఎంపికను ఎంచుకోవాలి.
==> తర్వాత మీకు రసీదు నంబర్ అందజేస్తారు.
==> మీ అప్లికేషన్ క్రాస్ చెక్ చేస్తారు. మీకు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
==> పీఎఫ్ నిధులను తీసుకునేందుకు జాయింట్ ఫారమ్ ఉద్యోగి సమ్మతి కూడా అవసరం.
==> ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌పై మీ ఫోన్లో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, యజమానులు జీతంలో 12-12 శాతం వాటాను అందిస్తారు. యజమాని కంట్రిబ్యూషన్‌లో 12 శాతంలో 3.67 శాతం, 8.33 శాతం ఈపీఎస్‌లో జమ చేస్తారు. ఇప్పుడు 15 వేల పరిమితిని తొలగించి.. బేసిక శాలరీగా మార్చారు.
Also Read: IRCTC: ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి
Also Read: Kisan Vikas Patra: రైతులకు వరం కిసాన్ వికాస్ పత్ర.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook