Flipkart Pay Later Option: షాపింగ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వెసులుబాటు ఏర్పడింది. అంతేనా.. ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు పే ల్యాటర్ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. తద్వారా కస్టమర్స్ ముందు షాపింగ్ చేసేసి.. ఒక నెల రోజుల తర్వాత బిల్లు చెల్లించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న పే ల్యాటర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
'పే ల్యాటర్' ఎలా పనిచేస్తుంది :
ఫ్లిప్‌కార్ట్ పే ల్యాటర్ ద్వారా రూ.1 లక్ష వరకు క్రెడిట్ లభిస్తుంది. ఆ క్రెడిట్‌తో మీరు మీకు నచ్చిన వస్తువులను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేయవచ్చు. అయితే ఇది అన్ని ప్రొడక్ట్స్‌కి వర్తించదు. కొన్ని ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. నెలలో ఎన్నిసార్లయినా షాపింగ్ చేయవచ్చు. అన్ని ఆర్డర్స్‌కి కలిపి ఒకే బిల్లు పొందుతారు. వస్తువులు ఆర్డర్ చేసిన సమయంలో మీరెటువంటి డబ్బు చెల్లించనక్కర్లేదు. అలా అని డెలివరీ సమయంలోనూ మీరు చెల్లింపులు చేయనక్కర్లేదు. తదుపరి నెల 5వ తేదీన ఆ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. లేదా ఆ బిల్లును 12 నెలల ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని నెలా నెలా చెల్లింపులు చేయవచ్చు.
'పే ల్యాటర్' బెనిఫిట్స్ :
మీరు చెల్లించాల్సిన బిల్లుపై అదనపు ఛార్జీలేమీ ఉండవు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ప్రకటించినప్పుడు మీ చేతిలో డబ్బు లేదని చింతించాల్సిన పనిలేదు. మీరు పొందిన క్రెడిట్ మేరకు మీకు నచ్చిన వస్తువులను బుక్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే ల్యాటర్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందుతారు.
పే ల్యాటర్కి ఎలా అప్లై చేయాలి :
పేల్యాటర్కి అప్లై చేసుకోవడం చాలా సులువు. కేవలం 30 సెకన్లలోనే ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను https://www.flipkart.com/flipkart-pay-later-storeలో పొందుపరచాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ సమర్పించిన 30 సెకన్లలో వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నట్లయితే వెంటనే పేల్యాటర్ యాక్టివేట్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook