Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Gold Price Today June 25th 2022 : బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4745గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5176గా ఉంది.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 25, 2022, 07:05 AM IST
  • తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.200 మేర తగ్గిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.230 మేర తగ్గిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Gold Price Today June 25th 2022 : పసిడి ప్రియులకు శుభవార్త.  శుక్రవారం (జూన్ 24) స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (జూన్ 25) దిగొచ్చాయి. నిన్న ఎంతయితే ధర పెరిగిందే అంతే స్థాయిలో ఇవాళ ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,450కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990 నుంచి రూ.51,760కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..: 

హైదరాబాద్‌లో శుక్రవారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా.. ఇవాళ (జూన్ 25) అది రూ.47,450కి చేరింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.51,990 ఉండగా...  ఇవాళ రూ.51,760కి చేరింది.

ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.51,820గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,7600గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850గా ఉంది. 

కోల్‌కతా, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820గా ఉంది.

పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,810గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760గా ఉంది. 

జూన్ 14న రూ.1050 మేర, జూన్ 16న రూ.430 మేర దిగొచ్చిన బంగారం ధర.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ,పెరుగుతూ వస్తోంది. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు నమోదవుతాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలు బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతాయి.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)
 

Also Read: Horoscope Today June 25th: నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు..

Also Read: Big Debate With Bharath : ఎర్రబెల్లి హత్యకు కొండా దంపతులు స్కెచ్ వేసింది నిజమేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News