Gold Price Today August 18th 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధర దిగొచ్చింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. ఈ రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.280 మేర ధర తగ్గింది. ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉంది. హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం...
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం (ఆగస్టు 17)రూ.48000 ఉండగా.. ఇవాళ అది రూ.47,900కి తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,360 ఉండగా.. ఇవాళ రూ.52,250కి తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌తో పోలిస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.50 మేర ధర ఎక్కువగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్కడ రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,2500గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉంది.
గడిచిన 10 రోజుల్లో మూడుసార్లు పెరిగిన బంగారం ధర మూడుసార్లు దిగొచ్చింది. ఆగస్టు 10న రూ.660 మేర, ఆగస్టు 17న రూ.150 మేర, ఇవాళ రూ.110 మేర ధర దిగొచ్చింది. రాబోయే 2, 3 రోజుల్లో ధర మళ్లీ స్వల్పంగా పెరగవచ్చు.బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ తదితర అంశాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
Also Read: August Bank Holidays : కస్టమర్స్‌కు అలర్ట్... రేపటి నుంచి బ్యాంకులకు 4 వరుస సెలవులు...
Also Read: IQOO 9T 5G: సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ అద్భుత ఆఫర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook