Gold Price Today September 1st 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరోసారి దిగొచ్చింది. నిన్న (ఆగస్టు 31) స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇవాళ అంతకు రెట్టింపు స్థాయిలో తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270కి చేరింది. హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఇంచుమించుగా ఎప్పుడూ ఒకే ధరలు ఉంటాయి. ప్రస్తుతం కూడా ఈ మూడు నగరాల్లో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ 3 నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,860గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది.
గడిచిన 10 రోజుల ధరలను పరిశీలించినట్లయితే... రూ.860 మేర పెరిగిన బంగారం ధర, రూ.1740 మేర దిగొచ్చింది. అంటే పెరిగిన దాని కన్నా తగ్గిందే ఎక్కువ. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆగస్టు నెల ప్రారంభంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 ఉండగా.. నెలాఖరు నాటికి ఆ ధరలు రూ.47 వేలు, రూ.51,270గా ఉన్నాయి. అంటే.. నెల ప్రారంభంతో పోలిస్తే నెలాఖరు నాటికి ధరలు స్వల్ప తగ్గుదలతో ముగిశాయి. మరి ఈ సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read: India vs Hong Kong : పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఘనవిజయం.. చితక్కొట్టిన సూర్య కుమార్ యాదవ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook