HDFC Bank Alert: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్, ఆ రోజు బ్యాంకు క్లోజ్, యూపీఐ కూడా పనిచేయదు

HDFC Bank Alert: బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఆ రోజు పనిచేయదు. బ్యాంకు ఆన్‌లైన్ సేవలు కూడా ఆ రోజు పనిచేయవు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు బ్యాంకు కస్టమర్లకు అన్ని విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2024, 02:59 PM IST
HDFC Bank Alert: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్, ఆ రోజు బ్యాంకు క్లోజ్, యూపీఐ కూడా పనిచేయదు

HDFC Bank Alert: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు తీవ్ర ఇబ్బంది కలగనుంది. వచ్చేవారం అంటే జూలై 13వ తేదీన బ్యాంకు సేవలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పూర్తిగా నిలిచిపోనున్నాయి. దాదాపుగా 14 గంటల సేపు హెచ్‌‌‌డి‌ఎఫ్‌సి కస్టమర్లకు బ్యాంకు సేవలు అందవు. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు కీలకమైన అప్‌డేట్ ఇది. బ్యాంకు సేవలు దాదాపుగా 14 గంటలు నిలిచిపోనున్నాయి. యూపీఐ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నగదు బదిలీ, ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడం అన్నింటికీ అంతరాయం కలగనుంది. మీ బ్యాంకు ఎక్కౌంట్ ఏ మాత్రం వినియోగించలేరు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయలేరు. ఆఖరికి యూపీఐ సేవలు కూడా పనిచేయవు. ఇప్పటికే బ్యాంకు నుంచి కస్టమర్లకు ఈ దిశగా మెస్సేజ్, మెయిల్స్ వెళ్తున్నాయి. దాదాపు 14 గంటల అంతరాయం తరువాత బ్యాంకు పని తీరు, వేగం, సామర్ధ్యం మరింత మెరుగుపడవచ్చని తెలుస్తోంది. 

ఈ క్రమంలో హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంటుంది. జూలై 13ను దాదాపుగా 14 గంటలు బ్యాంకుకు సంబంధించిన అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఎందుకంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కొత్త సిస్టమ్ అప్‌గ్రేడ్ అవుతోంది. అందుకే జూలై 13వ తేదీన దాదాపు 14 గంటల సేపు ఏ విధమైన బ్యాంకు సేవలు పనిచేయవు. కస్టమర్లు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది. ఈ అప్‌డేట్ పూర్తయ్యాక బ్యాంకు సేవలు మరింత వేగవంతం కానున్నాయి. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎప్పుడు పనిచేయదంటే

బ్యాంకు జారీ చేసిన అధికారిక సమాచారం మేరకు జూలై 13వ తేదీన ఉదయం 3 గంటల్నించి సాయంత్రం 4.30 గంటల వరకూ బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ 14 గంటల సమయంలో బ్యాంక్ మూసివేసి ఉంటుంది. ఏటీఎం, యూపీఐ, బ్యాంకింగ్ సేవలు ఆ రోజు ఉదయం 3 గంటల్నించి పనిచేయవు.

నెట్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్, యూపీ సేవలు జూలై 13న ఉదయం 3 గంటల్నించి 3.45 నిమిషాలు తిరిగి 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరిచేయవు. డీమాట్, కార్డులు, లోన్ల స్టేటస్ చూసుకోవచ్చు కానీ చెల్లింపులు చేయలేరు. ఉదయం 3 గంటల్నించి సాయంత్రం 4.30 గంటల వరకూ ఎలాంటి బ్యాకింగ్ సంబంధిత సేవలు పనిచేయవు. ఎక్కౌంట్ బ్యాలెన్స్ కూడా చూసేందుకు వీలుండదు. 

Also read: HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News