Gas Cylinder Booking: ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ లేకుండాన్ LPG గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్

How To book LPG cylinder without Aadhaar or address proof: సామన్యుల అవరాలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకనుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ అడ్రస్ ప్రూఫ్ మరియు ఆధార్ కార్డ్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదట

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2021, 12:21 PM IST
  • ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా, మీకు శుభవార్త
  • ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ లేకుండాన్ LPG గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్
  • ఎల్పీజీ సిలిండర్‌ను మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం
Gas Cylinder Booking: ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ లేకుండాన్ LPG గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్

Indane LPG cylinder without Aadhaar or address proof: మీరు ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు శుభవార్త. సామన్యులకు అవరాలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

ఇకనుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ అడ్రస్ ప్రూఫ్ మరియు ఆధార్ కార్డ్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదట. కేవలం ఏదైనా అధికారిక ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పిస్తే సరిపోతుందని ఐఓసీఎల్ తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు మరియు కంపెనీలు గతంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ (LPG Gas Cylinder) ఇవ్వాలంటే వినియోగదారుల నుంచి కచ్చితంగా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ వివరాలు తీసుకునేవారు. 5 కేజీల ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం ఈ మార్పులు తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ రిఫిల్ చేసుకునేందుకు దగ్గర్లోని డీలర్‌‌ను సంప్రదించాలని సూచించింది. ఈ అన్ని సిలిండర్లు బీఐఎస్ సర్టిఫైడ్ అని సైతం స్పష్టత ఇచ్చింది.

Also Read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి

ఒకవేళ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ అవసరం లేదనుకుంటే వాటిని తిరిగి ఇచ్చేయడానికి అవకాశం సైతం కల్పించింది. 5 ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి ఇచ్చేసే వారికిలో సిలిండర్ ధరపై 50 శాతం నగదు వినియోగదారులకు చెల్లిస్తారు. అయిదేళ్ల గడువు అనంతరం కంపెనీకి తిరిగి ఇచ్చేసే సిలిండర్లపై కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తారని పేర్కొంది. 

ఈ 5 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ (LPG Cylinder Cashback)ను వినియోగదారులు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇండేన్ స్పెషల్ నెంబర్ 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. సిలిండర్ రిఫిల్లింగ్ కోసం వినియోగదారులు 7588888824 నెంబర్‌కు మెస్సేజ్ లేదా కాల్ చేయాలని సూచించింది.

Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News