Hyundai plans to release New Micro SUV, Rival Tata Punch: భారతదేశ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్కువగా వాహనాలు లేవు. ప్రస్తుతానికి 'టాటా పంచ్' ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. టాటా పంచ్‌ను విడుదల చేసి దాదాపు ఏడాదిన్నర (15 నెలలు) అయినా.. అమ్మకాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. టాటా కంపెనీ ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా టాటా పంచ్ యూనిట్లను విక్రయించింది. అంటే సగటున ప్రతి నెల 10000 యూనిట్లు అమ్ముడవువుతున్నాయి. తక్కువ సమయంలో ఎంత వేగంగా ఈ కారు ప్రజాదరణ పొందిందో ఈ గణాంకాలు బట్టి అర్ధం చేసుకోవచ్చు.
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న ఏకైక ఉత్తమ ఎంపికగా ఉండడం టాటా పంచ్‌కు కలిసొచ్చింది. అంతేకాదు ఎస్‌యూవీ డిజైన్ కారణంగా ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇతర కార్ల తయారీదారులు కూడా ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించారు. అందులో హ్యుందాయ్ కూడా ఉంది. హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం కొత్త మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2023 సంవత్సరంలోనే ఆ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కారు లాంచ్, టైమ్‌లైన్ వివరాలు ఇంకా బయటికి రాలేదు.
గత డిసెంబర్‌లో హ్యుందాయ్ కారుకి టెస్ట్ కూడా నిర్వహించారు. కొరియన్ కార్ తయారీదారు హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న కొత్త మైక్రో ఎస్‌యూవీకి Ai3 అనే పేరు పెట్టారట. ఇది బ్రాండ్ యొక్క K1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండవచ్చు. ఇది శాంట్రో మరియు హ్యుందాయ్ కాస్పర్ మైక్రో ఎస్‌యూవీలకు కూడా పోటీ ఇస్తుంది. ఇక ఈ కారు ఇంటీరియర్ గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే ఉంటుంది. గ్రాండ్ ఐ10 నియోస్‌లో ఉన్నటువంటి ఇంజన్ ఎంపిక ఉండనుంది.
హ్యుందాయ్ కొత్త మైక్రో ఎస్‌యూవీకి మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికలతో 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కొత్త మినీ ఎస్‌యూవీని CNG వెర్షన్‌లో కూడా తీసుకురావచ్చు. అయితే CNG వెర్షన్ లేటుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారు భారత మార్కెట్‌లో టాటా పంచ్ మరియు సిట్రోయెన్ C3లకు పోటీగా విడుదల అవుతుంది. ఈ కారు ధర దాదాపు రూ. 6 లక్షల నుంచి మొదలవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.