Kia Carens Luxury (O) launched in India @ Rs 17 lakhs: కియా ఇండియా 17 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో కొత్త లగ్జరీ (O) వేరియంట్‌ను విడుదల చేయడం ద్వారా కేరెన్స్ ఎంపీవీ (Carens MPV) మోడల్ లైనప్‌ను విస్తరించింది. కొత్త వేరియంట్ 7-సీట్ కాన్ఫిగరేషన్‌లో ప్రవేశపెట్టబడింది. ఈ కారు మోడల్ లైనప్‌లో లగ్జరీ ట్రిమ్‌ల పైన మరియు లగ్జరీ+ ట్రిమ్‌ల క్రింద మధ్య ఉంటుంది. కొత్త కియా కేరెన్స్ లగ్జరీ (O) వేరియంట్ మల్టీ డ్రైవ్ మోడ్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. లగ్జరీ ట్రిమ్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో వస్తాయి.
కియా కేరెన్స్ లగ్జరీ (O) వేరియంట్లో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల కలర్ MID, OTA అప్డేట్లతో కూడిన Kia కనెక్ట్ UI, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెండవ వరుస సీట్‌బ్యాక్ టేబుల్ ఉన్నాయి. టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, అండర్ సీట్ ట్రే, ఫుల్ లెథెరెట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్స్, LED DRLలు మరియు LED టెయిల్‌ల్యాంప్‌ల ఈ కారులో ఉన్నాయి.
కియా కేరెన్స్ లగ్జరీ (O) వేరియంట్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఈ వేరియంట్ 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.
కియా కేరెన్స్ లగ్జరీ (O) వేరియంట్లో పెట్రోల్ ఇంజన్ యూనిట్ 253ఎన్ఎమ్లతో పాటు 160బిహెచ్పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ యూనిట్ 115బిహెచ్పి మరియు 250ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (డీజిల్ మాత్రమే) మరియు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఎంపికను కలిగి ఉంది.
Also Read: Mahindra XUV400 Errors: మహీంద్రా ఎక్స్‌యూవీ400లో 3 లోపాలు.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి