LPG Gas Price Hike: నేటి నుంచి కొత్త నెల ప్రారంభమైంది. ప్రతి నెల మాదిరే ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకోవగా.. డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్ తగ్గింది. అదేవిధంగా ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రావిట్ పెరిగింది. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో టాన్స్‌క్షన్ రుసుము కూడా పెరిగింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి చోటు చేసుకున్న మార్పులను ఓసారి గమనిద్దాం..
నవంబర్ నెల ప్రారంభంతోనే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. కమర్షియల్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. రూ.101.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1833కి చేరింది. డొమస్టిక్ సిలిండర్ ధరల విషయలో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికల వేళ గ్యాస్ ధరలు పెరగవని అందరూ ఊహించారు. అయితే ధరలను పెరగడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు.
ఇక డీజిల్ ఎక్స్‌పోర్ట్‌పై ట్యాక్స్ తగ్గించగా.. దేశంలో ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లేదా SAED రూపంలో విధించే ట్యాక్స్‌కు రూ.9,050 నుంచి రూ.9,800కి పెరిగింది. డీజిల్ ఎగుమతిపై SAED లీటరుకు 4 రూపాయల నుంచి 2 రూపాయలకు.. విమాన ఇంధనం (ATF)పై లీటరుకు ఒక రూపాయి నుంచి సున్నాకి తగ్గించారు. పెట్రోల్ ఎగుమతిపై SAED ఇప్పటికే సున్నాగా ఉన్న విషయం తెలిసిందే. కొత్త రేట్లు నవంబర్ 1వ తేదీ నుంచే వర్తిస్తాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నవంబర్ 1 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీల ఫీజును పెంచింది. S&P BSE సెన్సెక్స్ ఎంపికలపై ఈ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుంకం పెంపు రిటైల్ ఇన్వెస్టర్లు, వ్యాపారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారం చేసే వారు 30 రోజుల్లోగా ఈ-చలాన్ పోర్టల్‌లో జీఎస్టీ చలాన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కూడా కీలక మార్పులు చేసింది. నేటి నుంచి బీమా చేసిన వ్యక్తులందరు కేవైసీ తప్పకుండా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి