Share Market: కేవలం నెల రోజుల్లోనే ఇన్వెస్టర్లకు కోట్లాది రూపాయలు నష్టాలు మిగిల్చిన ఆ కంపెనీ షేర్

Share Market: షేర్ మార్కెట్‌లో ఎగుడుదిగుడు సాధారణమే. కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తుంటే..మరికొన్ని నష్టాలు కల్గిస్తుంటాయి. ఇటీవల కొద్దిరోజుల్నించి షేర్ మార్కెట్ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2023, 08:00 PM IST
Share Market: కేవలం నెల రోజుల్లోనే ఇన్వెస్టర్లకు కోట్లాది రూపాయలు నష్టాలు మిగిల్చిన ఆ కంపెనీ షేర్

కొత్త ఏడాదిలో షేర్ మార్కెట్ బాగుంటుందని అందరూ ఆశించారు. గత కొద్దికాలంగా షేర్ మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో..కొత్త ఏడాది ప్రారంభం బాగుండాలని కోరుకున్నారు. అయితే పరిస్థితి మరోలా ఉంది. 

షేర్ మార్కెట్‌లో ప్రతి రోజూ వేలాది షేర్ల వ్యాపారం జరుగుతుంటుంది. కొన్ని షేర్లు అమాంతం పైకి వెళ్తుంటే..కొన్ని షేర్లు మాత్రం పడిపోతుంటాయి. కొన్ని షేర్లు వరుసగా ఇన్వెస్టర్లకు లాభాలు కల్గిస్తుంటే..కొన్ని మాత్రం నష్టాలపాలు చేస్తుంటాయి. ఇలానే ఓ కంపెనీ షేర్ ఇన్వెస్టర్లను నెల రోజుల్నించి నష్టాలకు గురి చేస్తోంది. 

ఎంఆర్ఎఫ్

దాదాపు నెల రోజుల్నించి ఇన్వెస్టర్లను నష్టాలకు గురి చేస్తున్న కంపెనీ ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్ షేర్ ఇండియన్ షేర్ మార్కెట్‌లో చాలా ఎక్కువ. కానీ ఓ నెలరోజుల్నించి ఈ కంపెనీ షేర్ భారీగా క్షీణిస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ 6 వేలకు పైగా పడిపోయింది. 

నెల రోజుల క్రితం ఎంఆర్ఎఫ్ షేర్ 6 శాతం కంటే ఎక్కువే క్షీణించింది. డిసెంబర్ 5, 2022న ఎంఆర్ఎఫ్ షేర్ ఎన్ఎస్ఈలో 94673.70 రూపాయలకు క్లోజ్ అయింది. అప్పటి నుంచి వరుసగా ఈ కంపెనీ షేర్ ధర పడిపోతోంది. జనవరి 4వ తేదీ 2023 నాటికి కంపెనీ షేర్ 88 వేలకు పడిపోయింది. 

జనవరి 4, 2023న ఎంఆర్ఎఫ్ షేర్ ఎన్ఎస్ఈలో 88429.95 రూపాయలకు క్లోజ్ అయింది. అంటే గత నెల రోజులుగా ఎంఆర్ఎఫ్ షేర్ ధరలో 6243.73 రూపాయలు అంటే 6.60 శాతం తగ్గింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చింది. 

Also read: Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News