Stock Market today: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- 57,400 పైకి సెన్సెక్స్​

Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతపు నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం సెషన్​లో లాభాలతో ముగిశాయి సూచీలు. ఐటీ, ఫార్మా షేర్లు అధికంగా లాభాలను గడించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 10:39 PM IST
  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • దన్నుగా నిలిచిన ఐటీ, ఫార్మా షేర్లు
  • దాదాపు అన్ని రంగాల్లో సానుకూలతలు
Stock Market today: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- 57,400 పైకి సెన్సెక్స్​

Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం (Stocks Closing bell) లాభాలతో ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 296 పాయింట్లు పెరిగి 57,420 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 82 పాయింట్ల స్వల్ప లాభంతో 17,086 వద్ద స్థిరపడింది.

దాదాపు అన్ని రంగాలు లాభాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 57,512 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  56,543 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,112 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,833 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 24 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 6 కంపెనీలు డీలా పడ్డాయి.

టెక్​ మహీంద్రా (3.57 శాతం), డాక్టర్ రెడ్డీస్​ (1.95 శాతం), పవర్​గ్రిడ్​ (1.56 శాతం), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.56 శాతం), సన్​ఫార్మా (1.16 శాతం) లాభాలను నమోదు చేశాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ (0.55 శాతం), ఏషియన్​ పెయింట్స్​ (0.44 శాతం), మారుతీ (0.32 శాతం), భారతీ ఎయిర్​టెల్​ (0.23 శాతం), ఐటీసీ (0.21 శాతం) నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే..  థైవాన్, హాంగ్​ సెంగ్ (హాంకాంగ్​)​ సూచీలు లాభాలను గడించాయి. 

షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి. 

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి దాదాపు స్థిరంగా ఉంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.99 వద్ద కొనసాగుతోంది.

Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి ​Twitter , Facebook

Trending News