Tesla Electric Car: ప్రపంచం మొత్తం ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కారుపైనే దృష్టి సారించింది. ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కారు ఎప్పుడొస్తుందనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కొత్తగా మరో సమస్య తెరపైకొచ్చింది.
టెస్లా ఎలక్ట్రిక్ కారు(Tesla Electric Car). ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న సరికొత్త కారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాలో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రవేశపెట్టేందుకు టెస్లా కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు ఇండియాలో కూడా ఎప్పుడు టెస్లా కారు ఎంట్రీ ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ మేరకు టెస్లా, భారతదేశ ప్రభుత్వాల మధ్య ఓ వైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరో సమస్య కొత్తగా తెరపైకొచ్చింది.
టెస్లా లేటెస్ట్ మోడల్ కారు ఎస్ ప్లెయిడ్. కేవలం రెండే రెండు సెకన్ల వ్యవధిలో 60 మైళ్ల స్పీడు అందుకోగలదు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 2 వందల మైళ్ల దూరం ప్రయాణించగలదు.సెడాన్ మోడల్లో పవర్ ఎస్‌యూవీకు దీటుగా ఉంటుంది.ఇండియాలో కూడా ఈ మోడల్ కారును ప్రవేశపెట్టేందుకు టెస్లా యోచిస్తోంది.టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు పూర్తిగా అమెరికన్ రోడ్లకు అనుగుణంగా తయారైంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 25 మిల్లీమీటర్లు మాత్రమే.ఇండియన్ రోడ్లపై స్మూత్ జర్నీ కొనసాగాలంటే కనీసం 140 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. లేకపోతే బంపీ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కారు బాడీ నేలను తాకేస్తుంది. ఇండియన్ మార్కెట్ కోసం అంచనా వేసినప్పుడు చేసిన టెస్ట్ డ్రైవ్‌లో గ్రౌండ్ క్లియరెన్స్(Ground Clearance)సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఎస్ ప్లెయిడ్ కారును ఇండియాలో తీసుకురావాలంటే..కచ్చితంగా డిజైన్ మార్పులు చేయాల్సిందే. గ్రౌండ్ క్లియరెన్స్‌ను 25 మిల్లీమీటర్ల నుంచి 165 మిల్లీమీటర్ల వరకూ పెంచాలి. మరి టెస్లా(Tesla) ఈ సమస్యను అధిగమిస్తుందో లేదో చూడాలి.
Also read: FDI in India: ఇండియా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 62 శాతం వృద్ధి రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook