Gold Purchase Tips: బంగారం అమూల్యమైనదే కాదు ఖరీదైంది కూడా. అందుకే బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోకతప్పదు. బంగారం కొనేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇవాళ అక్షయ తృతీయ. చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో మార్కెట్‌లో ఎక్కడ ఏ ధర పలుకుతుందో చూసుకోవాలి. ఎంసీఎక్స్‌పై బంగారం ధర స్వల్పంగా అంటే 2.13 శాతం తగ్గి..పది గ్రాముల బంగారం 50 వేల 650 రూపాయలుగా ఉంది. ఐబీజేఏ వెబ్‌సైట్‌పై 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 336 రూపాయలుంది.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎప్పుడూ గోల్డ్ ప్యూరిటీని దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలే ఎంచుకోవాలి. కేవలం కేరెట్ల పరంగానే కాకుండా గోల్డ్ ఫినిషింగ్ ద్వారా కూడా నాణ్యతను అంచనా వేయవచ్చు. ప్యూరిటీ బాగుంటే..ఎప్పుడైనా తిరిగి ఆ బంగారాన్ని అమ్మాల్సిన వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తవు. చాలా సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసినప్పుడు సంబంధిత వ్యాపారి ఇచ్చిన రఫ్‌బిల్ తీసుకుని వచ్చేస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఆ బిల్‌లో కొన్న బంగారు ఆభరణం, మేకింగ్ ఛార్జెస్, షాప్ వివరాలు తప్పకుండా ఉండాలి.
గోల్డ్ కాయిన్ విషయంలో ప్యాకేజింగ్ చాలా కీలకంగా ఉంటుంది. గోల్డ్ కాయిన్ ప్యాకేజింగ్ ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉండాలి. దీనివల్ల కాయిన్ నాణ్యత శాశ్వతంగా ఉంటుంది. ప్యాకేజింగ్ పాడైతే..విక్రయించేటప్పుడు సమస్య తలెత్తుతుంది. అందుకే ప్యాకేజింగ్‌ను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. బంగారం కొనేటప్పుడు మీ దృష్టి దానిపైనే ఉండాలి. మరే ఇతర విషయాలపై ఉండకూడదు. బంగారం బరువు, నాణ్యత అన్ని విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ఇక మేకింగ్ ఛార్జ్ అనేది ఆభరణాన్ని బట్టి మారుతుంటుంది. ఇది 6 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. దీనిపై మినహాయింపులు కూడా వర్తిస్తుంటాయి.
Also read: Netflix Free: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్స్‌పై ఇక నెట్‌ఫ్లిక్స్ ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook