Upcoming Cars 2023: ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు.. చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్!

Upcoming Car launches in february 2023. 2023 ఫిబ్రవరిలో కొత్త కార్లు విడుదల కానున్నాయి. రెండు ఎస్‌యూవీలు, ఒక ఎంపీవీ మరియు ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల కానున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 31, 2023, 08:01 PM IST
  • ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు
  • చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్
  • మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కార్
Upcoming Cars 2023: ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు.. చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్!

Upcoming Car launches in february 2023: వచ్చే నెల (2023 ఫిబ్రవరి)లో పలు కొత్త కార్లు విడుదల కానున్నాయి. రెండు ఎస్‌యూవీలు, ఒక ఎంపీవీ మరియు ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. ఎస్‌యూవీ కేటగిరిలో మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్జీ మరియు హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవ్వొచ్చు. ఎంపీవీ కేటగిరిలో టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ను విడుదల చేయవచ్చు. ఇక సిట్రోయెన్ C3 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల కానుంది. 

TOYOTA INNOVA CRYSTA DIESEL:
టయోటా కిర్లోస్కర్ మోటార్ అప్‌డేట్ చేయబడిన ఇన్నోవా క్రిస్టా డీజిల్ (మాన్యువల్) మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. దీని ధరలు ఫిబ్రవరిలో ప్రకటించనుండగా.. ఈ ఆకృ డెలివరీలు ఏప్రిల్ చివరిలో ప్రారంభమవనున్నాయి. నవీకరించబడిన మోడల్ లైనప్ నాలుగు గ్రేడ్‌లలో ( G, GX, VX మరియు ZX) వస్తుంది. ఇది 2.4L డీజిల్ ఇంజన్‌తో రానుంది. 7 మరియు 8-సీట్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

CITROEN EC3:
భారతదేశంలో ఫ్రెంచ్ ఆటోమేకర్ నుంచి మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కార్ సిట్రోన్ ఈ-సి3. 29.2kWh బ్యాటరీ ప్యాక్ మరియు ఫ్రంట్ యాక్సిల్‌లో ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఈ సెటప్ 57PS గరిష్ట శక్తిని మరియు 143Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌తో 320 కిమీ ప్రయాణించొచ్చు. ధర సుమారు రూ.10 లక్షల వరకు ఉంచవచ్చు.

MARUTI BREZZA CNG:
మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్జీ ఫిబ్రవరి 2023లో అమ్మకానికి అందుబాటులోకి రావచ్చు. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు ఈ కార్లు వచ్చాయి. ఇటీవల ఆటో ఎక్స్‌పోలో కూడా ఈ కారును ప్రదర్శించారు. ఇది 1.5L K15C పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CNG కిట్‌ను కలిగి ఉంటుంది. బ్రెజ్జా సీఎన్జీ 27.km/kg మైలేజీని ఇస్తుంది.

HYUNDAI VENUE FACELIFT:
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి 2023లో మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను పొందే అవకాశం ఉంది. ఇది ఐదు ట్రిమ్‌లలో (E, S, S (O), SX మరియు SX (O)) అందుబాటులో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్‌తో రానుంది. దీని డీజిల్ ఇంజిన్ ప్రస్తుత డీజిల్ ఇంజిన్ కంటే శక్తివంతమైనది.

Also Read: Google Pixel 7 Price: ఫ్లిప్‍కార్ట్ కంటే.. అమెజాన్‌లోనే తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 7! ఏకంగా రూ. 6300 వ్యత్యాసం   

Also Read: Dan Mousley Six: భారీ సిక్స్ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్.. బంతి అందుకుని పారిపోయిన ఫ్యాన్! నవ్వులు పూయించే వీడియో  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News