Jangaon Man Death: విషాదం.. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి..

చికెన్ ముక్క, గుడ్డు, మాంసం ఎముక గొంతులో ఇరుక్కుపోయి వ్యక్తులు మృతి చెందారనే వార్తలు చూసి ఉంటారు. కానీ ఓ వ్యక్తి విచిత్రంగా ఆమ్లెట్ తింటూ ప్రాణాలు కోల్పోయాడు. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 12:18 PM IST
Jangaon Man Death: విషాదం.. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి..

Omelet Stuck in Throat: చికెన్ ముక్క, గుడ్డు, మాంసం ఎముక గొంతులో ఇరుక్కుపోయి వ్యక్తులు మృతి చెందారనే వార్తలు చూసి ఉంటారు. కానీ ఓ వ్యక్తి విచిత్రంగా ఆమ్లెట్ తింటూ ప్రాణాలు కోల్పోయాడు. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు.

తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి అనే వ్యక్తి వైన్ షాపులో మందు కొనుగోలు చేశాడు. మందులోకి స్టఫ్గా ఆమ్లెట్ తీసుకున్నాడు. మద్యం సేవిస్తూ.. ఆమ్లెట్ తింటున్నాడు. ఇంతలో ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఏమైందని పక్కన ఉన్న వారు వచ్చి చూశారు. ఊపిరి ఆడకపోవడంతో భూపాల్‌రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం అందుకుని విచారిస్తున్నారు. గతేడాది జూన్‌లో అస్సాంలో లిచీ పండు గింజ గొంతులో ఇరక్కుని ఊపిరి ఆడక ఓ బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. గతంలో తమిళనాడులో పరోటా గొంతులో ఇరుక్కుని ఓ నవ వరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

అందుకే ఏదైనా తినే సమయంలో నెమ్మదిగా తినాలని అంటారు. ఏదో పని ఉందని ఆత్రంగా.. స్పీడ్‌గా తింటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆహారం తీసుకునే విషయంలో ఇలా నిర్లక్ష్యంగా తింటూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

Also Read: TRS mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడే హైకోర్టులో విచారణ.. అందరిలోనూ ఉత్కంఠ  

 Also Read: Koppula Eshwer: ప్రగతి భవన్ లో దళిత మంత్రికి ఘోర అవమానం.. తన పక్కన కూర్చోనివ్వని కేసీఆర్?

 Also Read: CM KCR: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స్కెచ్.. కేసీఆర్ సంచలన కామెంట్స్.. వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News