Top Gear Movie Review : టాప్ గేర్ మూవీ రివ్యూ.. ఆది ఆకట్టుకున్నాడా?

Top Gear Movie Review టాప్ గేర్ మూవీ నేడు (డిసెంబర్ 30) థియేటర్లోకి వచ్చింది. ఆది సాయి కుమార్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? జనాలు ఆకట్టుకునేలా సినిమా ఉందా?అన్నది ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 08:04 AM IST
  • నేడే థియేటర్లోకి టాప్ గేర్
  • ఆది సాయి కుమార్ కొత్త సినిమా సందడి
  • టాప్ గేర్‌తో ఆది గట్టెక్కేనా?
Top Gear Movie Review : టాప్ గేర్ మూవీ రివ్యూ.. ఆది ఆకట్టుకున్నాడా?

Top Gear Movie Review ఆది సాయి కుమార్ ప్రతీసారి కొత్తగా ట్రై చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈక్రమంలో కొన్ని ప్రయోగాలు బెడిసి కొడుతుంటాయి. చివరగా వచ్చిన తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు టాప్ గేర్ అంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కథ కథనాలు ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
సిద్దార్థ్ (మైమ్ గోపీ) ముంబైలో పెద్ద డ్రగ్ డీలర్. కోట్ల విలువైన డ్రగ్స్‌ హైద్రాబాద్‌లో చిక్కుకుంటాయి. వాటిని చేజిక్కించుకునేందుకు వచ్చే సిద్దార్థ్ మీద ఏసీపీ విక్రమ్ (శత్రు) కన్ను ఉంటుంది. క్యాబ్ డ్రైవర్‌ అర్జున్ (ఆది సాయి కుమార్) ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంటుంది. దీంతో పోలీసులు, ఏపీసీ విక్రమ్, సిద్దార్థ్ ఇలా అందరూ కూడా అర్జున్‌ను టార్గెట్ చేస్తుంటారు. వీరందరి నుంచి తప్పించుకుని సిద్దార్థ్ వల్ల ప్రమాదంలో తన భార్య ఆద్య(రియా సుమన్‌)ను అర్జున్ ఎలా కాపాడుకుంటాడు? అసలు ఆ బ్యాగ్ ఎవరి దగ్గరకు చేరింది? డేవిండ్ అనే వ్యక్తి ఎవరు? చివరకు ఈ డ్రగ్స్ కేసు ఎలా ముగుస్తుంది? అర్జున్ ఈ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు
అర్జున్ పాత్రలో సాధారణ కుర్రాడిలా ఆది కనిపించాడు. రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నింట్లోనూ ఆది మెప్పించాడు. ఇక హీరోయిన్‌గా నటించిన రియా సుమన్‌ది అతిథి పాత్రలా అనపిస్తుంటుంది. ఏసీపీగా శత్రు బాగానే మెప్పిస్తాడు. కానీ అంత ప్రభావంగా అనిపించదు. సిద్దార్థ్ పాత్రలో మైమ్ గోపికి మొదటి నుంచి ఇచ్చిన ఎలివేషన్‌ చివర్లో తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. రవి, చమ్మక్ చంద్ర, బ్రహ్మాజీ, టెంపర్ రవి, సత్యం రాజేష్‌ ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.

 

విశ్లేషణ
డ్రగ్స్ మాఫియా, ఒక్క రాత్రిలో జరిగే కథ అని అనగానే మనకు కార్తీ ఖైదీ రేంజ్ సినిమా గుర్తుకు వస్తుంది. టాప్ గేర్ సినిమా కూడా ఇదే లైన్‌ మీద తీసినట్టు కనిపిస్తుంది. కానీ ఖైదీ ఎమోషన్స్‌, టాప్‌ గేర్ సినిమాలో కనిపించవు. అంతటి ఉత్కంఠ కూడా ఇందులో మిస్ అవుతుంది. కానీ ఆది తన సమస్యల నుంచి బయటపడతాడు? నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని మాత్రం కలిగించడంలో టీం సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది.

ఇక సినిమా కూడా ఒకే లొకేషన్‌లో తిరిగినట్టుగా అనిపిస్తుంది. రాత్రి పూట చేజింగ్ సీన్స్ బాగానే వచ్చాయి. కానీ చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. పోలీసులు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఒక ఫోన్‌ను, క్యాబ్‌ను కూడా ట్రేస్ చేయలేని స్థితిలో ఉంటారా? అనే లాజిక్స్ మాత్రం ప్రేక్షకుల మెదడ్లోకి వస్తే కష్టమే. అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం కాస్త బెటర్‌గా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా సాంకేతిక విషయానికి వస్తే.. హర్షవర్దన్ రామేశ్వర్ ఇచ్చిన ఆర్ఆర్ హైలెట్ అనిపిస్తుంది. హీరో కంటే విలనిజాన్ని బాగా ఎలివినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కెమెరా వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్‌గానే అనిపిస్తుంది. నిర్మాత కూడా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5

బాటమ్ లైన్ : 'టాప్ గేర్‌' వేయాల్సిన సమయంలోనే అక్కడక్కడా స్పీడు బ్రేకులు

Also Read : Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!

Also Read : Harish Shankar : పట్టువదలని విక్రమార్కుడు.. అధికారులతో పనులు చేయించే వరకు వదిలిపెట్టని హరీష్‌ శంకర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News