Saif Ali Khan meets auto driver Bhajan Singh: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల ముంబైలోని లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఈ క్రమంలో వైద్యులు మాత్రం పదిరోజుల పాటు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఫుడ్ విషయంలో కూడా ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన సైఫ్ ఈరోజు తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు.
ఆగస్టు 16 న తెల్లవారు జామున.. సైఫ్ పై కత్తిపొట్లతో దాడికి పాల్పడిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైఫ్ కుమారుడు.. వెంటనే ఒక ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించాడు. సదరు ఆటోవాలా కూడా.. రక్తపు మరకలతో ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా ఆస్పత్రికి కరెక్ట్ టైమ్ కు తీసుకెళ్లాడు. అతను కనీసం చార్జీలు కూడా తీసుకొలేదు.
ఆ తర్వాత అతను సైఫ్ అనే విషయం అతనికి తెలిసిందని చెప్పాడు. కష్టంలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని మాత్రమే ఆ సమయంలో ఆలోచించానని చెప్పాడు. గతంలో ముంబైకి చెందిన ఒక సంస్థ 11 వేల రూపాయల్ని.. సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటోవాలకు రివార్డుగా ఇచ్చింది. ఈరోజు సైఫ్ తన నివాసంలొ.. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిశారు.ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. హత్తుకుని చాలా సేపు ఎమోషనల్ అయ్యారు.
సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్‍ను కలిసిన సమయంలో వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ కు యాభైవేల రూపాయల్ని రివార్డుగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు తన ప్రాణాలు కాపాడిన ఆటోవాలాను సైఫ్ కలడం పట్ల అభిమానులు..బాలీవుడ్ నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter