Anasuya in Item song: కేవలం 3 నిమిషాలకు 20 లక్షలు తీసుకుంటున్న అనసూయ

Anasuya in Item song: బుల్లితెరపై హాట్ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్. విభిన్న రకాల లేటెస్ ఫోటోషూట్‌లతో చర్చనీయాంశమవుతున్న అనసూయ..కేవలం 3 నిమిషాలకు అడిగిన ధర వింటే అవాక్కవుతారు. 

Last Updated : Jan 30, 2021, 06:48 PM IST
Anasuya in Item song: కేవలం 3 నిమిషాలకు 20 లక్షలు తీసుకుంటున్న అనసూయ

Anasuya in Item song: బుల్లితెరపై హాట్ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్. విభిన్న రకాల లేటెస్ ఫోటోషూట్‌లతో చర్చనీయాంశమవుతున్న అనసూయ..కేవలం 3 నిమిషాలకు అడిగిన ధర వింటే అవాక్కవుతారు. 

టీవీ స్కీన్ హాట్ వ్యాఖ్యాత ( TV Screen Anchor ) గా ప్రారంభమై సినిమాల్లో నటిస్తూ తనకంటూ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ ( Anasuya ). సోగ్గాడే చిన్నినాయనలో  ప్రత్యేకమైన పాటతో..రంగస్థలం ( Rangasthalam )లో గంగమ్మత్త ( Rangammattha ) గా జనానికి బాగానే గుర్తుండిపోయింది అనసూయ. ఇటీవలి కాలంలో లేటెస్ట్ ఫోటోషూట్‌లతో అభిమానుల గుండెల్లో కలవరం రేపుతోంది. విభిన్న పాత్రలతో వెండితెరపై సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తనదైన హాట్ ఫిగర్, అభినయంతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 

సాయి ధరమ్ తేజ ( Sai dharma tej ) నటించిన విన్నర్‌లో సుయా సుయా అనసూయ పాటలోనూ, విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 లో డింగు డాంగ్ పాటలో ఓ మెరుపు మెరిసింది. ఇప్పుడు తాజా అనసూయ చేస్తున్న సినిమా చావు కబురు చల్లగా. కార్తికేయ , లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌ ( Item song ) లో మరోసారి అందాలు ప్రదర్శించబోతోంది.ఈ చిత్రాన్ని కౌశిక్ తెరకెక్కిస్తుండగా..అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అంతా బాగానే ఉంది..ఇంతకీ ఈ సినిమాలో కేవలం 3 నిమిషాల ఐటెం సాంగ్ కు అనసూయ 20 లక్షలు ( 20 lakh fee for Anasuya ) తీసుకుంటోందట.ఐటెం సాంగ్ చాలా కీలకంగా ఉంటుందని..అందుకే 20 లక్షలు చెల్లించి ఒప్పించినట్టు దర్శకుడు చెబుతున్నాడు. ఈ ఐటెం సాంగ్ హైదరాబాద్‌లో షూట్ అవుతుండగా..జానీ మాస్టర్ కొరియోగ్రఫీ వహిస్తున్నాడు. మరోవైపు థ్యాంక్స్ బ్రదర్ సినిమాలో కూడా కీలకపాత్రలో అనసూయ కన్పించనుంది. 

Also read: Bollywood Actress Kajol: లేడీబాస్ పోజులతో ఫిదా చేస్తున్న కాజోల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News