నటి శ్రీరెడ్డి వివాదంలో కథ అనేకనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో "గంగపుత్రులు" సినిమా హీరో రాంకీ మాట్లాడుతూ ఈ కథలో ఆర్జీవి బహిర్గతం చేసిన విషయాలు ఇంటర్వెల్ మాత్రమేనని.. క్లైమాక్స్ వేరేగా ఉంటుందని తెలిపారు. ఈ కథలో ఆర్జీవి డైరెక్టర్ మాత్రమేనని.. కానీ నిర్మాతలు వేరేగా ఉన్నారని ఆయన తెలిపారు. బహుశా వర్మ కావాలనే ఈ విషయాన్ని తనపై వేసుకుంటున్నారని తనకు అనిపించిందని ఆయన అన్నారు. ఆర్జీవికి సారీ చెప్పే అలవాటు లేదని.. అలాంటిది ఆయన సారీ చెప్పారంటే ఏదో అంతరార్థం ఉందని రాంకీ అన్నారు. అలాగే మార్ఫింగ్ ఫోటోలతో నిర్మాత సురేష్ బాబు లొంగే అవకాశం లేదని.. నిజనిజాలు త్వరలోనే వెల్లడవుతాయని రాంకీ తెలిపారు
ఈ సంగతిని పక్కన పెడితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సినీ నిర్మాత అల్లు అరవింద్ విరుచుకుపడ్డారు. ఆర్జీవి ఓ పెద్ద నికృష్టుడు అని తెలిపారు. "తెలుగు సినిమా పరిశ్రమ తలదించుకొనే పరిస్థితులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ని దూషించమని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు వర్మ చెప్పారు. అయితే తన పేరు బహిర్గతం కాకముందే ఆర్జీవి వీడియో పెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ మీద నీకు అంత కక్ష ఎందుకో నాకు అర్థం కావడం లేదు.
ఆ కక్షను శ్రీరెడ్డి ద్వారా తీర్చుకున్నావు. నీ తల్లిని నాలుగు బూతులు ఎవరైనా తిడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. కానీ, మేం అలాంటి పనులు చేయం. ఆ అమ్మాయి వెళ్లి ‘రామ్‌గోపాల్ వర్మ ఇలా అనిపించాడు అని చెప్పకముందే నీ ట్రిక్ నువ్వు ప్లే చేశావు. శ్రీరెడ్డి అన్నది 20శాతం అయితే.. నువ్వు చేసిన పని 80 శాతం. పీఆర్పీ పార్టీలో ఇలాంటి పనులు చాలా జరిగాయి.
ప్రస్తుతం మహిళా సంఘాలకు ఒక్కటే నా వినతి. నిజనిజాలు తెలుసుకోకుండా సినీ పరిశ్రమ కుంగి కృశించేలా మాట్లాడవద్దని చెప్పుతున్నా. ఏదేమైనా సినీ పరిశ్రమలో మహిళా సమస్యల కోసం కమిటీ వేస్తున్నాం అన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ కమిటీ పని చేస్తుంది" అని ఆయన తెలిపారు. అయితే ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌కి ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలియజేయడం విశేషం.