ETV Diwali Special: దీపావళి పండుగ దగ్గర్లో ఉంది. ఈ మేరకు బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు.. ఈటీవీ రెడీ అయింది. మల్లెమాల టీం ఆల్రెడీ ఈ దీపావళి స్పెషల్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను వదిలింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది అంటూ స్పెషల్ ఈవెంట్‌తో శ్రీముఖి సందడి చేయబోతోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో వెండితెర సెన్సేషన్ మంచు లక్ష్మీ, బుల్లితెర క్వీన్, వెండితెర ప్రముఖ నటి అనసూయ సందడి చేయబోతోన్నారు.
ఇక ఈ ఈవెంట్లో యూట్యూబ్ స్టార్స్.. సోనియా, సిద్దు, షణ్ముఖ్ జశ్వంత్,ప్రసాద్ బెహరా, టీవీ ఆర్టిస్టులు పండు, ఆది, రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, నరేష్,మానస్, తనూజ, ఐశ్వర్య, సౌందర్య, కీర్తి బట్ వంటి వారి పర్ఫామెన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్.. స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఆయన అభిమానులకు ఫీస్ట్‌లా ఉండబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
లీలా వినోదం అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వచ్చిన షణ్ముఖ్ రా మచ్చా మచ్చా.. అనే పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేశాడు. రామ్ చరణ్ గేమ్ చేంజెరై సినిమాలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కి ఇప్పుడు షణ్ముఖ డాన్స్ వేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఆ లెవెల్ లోనే వైరల్ అవుతుంది.
ఇక తనకు ఈటీవీ విన్ ఎలా అండగా నిలిచిందో చెబుతూ.. అందరినీ ఎమోషనల్ చేశాడు. షణ్ముఖ్ మధ్యకు ఉంది కేసుల్లో అనేక సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నటుడు ఎప్పుడు ఈ ప్రోగ్రాంలో.. తన లైఫ్ లో జరిగిన కొన్ని కీలక ఘటనలను.. చెప్పబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతుంది. టీవీ ఆర్టిస్టులు సౌందర్య, ఐశ్వర్య, కీర్తి బట్, తనుజా మూవీలో హీరోయిన్ల పాత్రలను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండేలా.. కనిపిస్తోంది. ఈ అదిరిపోయే కార్యక్రమం ఈ దీపావళి రోజు ఉదయన 10 గంటలకి ఈటీవీ లో రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.
Also read: DSC: మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్.. 16,347 ఉద్యోగాల భర్తీకి ఆరోజే నోటిఫికేషన్ రిలీజ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.