Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..

Geethaanjali 2 OTT: అంజలి హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ హారర్ కామెడీ.. గీతాంజలి కి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా.. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. సినిమా ఓ మోస్తరుగా బానే కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకి సిద్ధం అవుతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 6, 2024, 07:33 PM IST
Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..

Geethanjali Malli Vachindi OTT: ప్రముఖ నటి అంజలి ద్విపాత్రాభినయం చేసిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి. ఆ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ మరొక సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. అంజలినే ఈ సినిమాలో కూడా నటించింది. అంజలి కెరియర్ లో ఈ సినిమా 50వ సినిమా అవడం ఈ చిత్ర ప్రత్యేకత. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, అలీ, సత్య, రాహుల్ మహాదేవ్, సునీల్, రవిశంకర్, రవికృష్ణ, ప్రియ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ.. ఈ హారర్ కామెడీ సినిమాలో.. హారర్, కామెడీ రెండూ తక్కువగానే ఉండడంతో సినిమా అనుకున్న స్థాయిలో మాత్రం హిట్ అవ్వలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో హంగామా చేయడానికి రెడీ అవుతోంది.

గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో మే 8 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది అని.. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా మిస్ అయినవాళ్లు ఆహాలో ఈ సినిమాని ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా చూసేయచ్చు. 

గీతాంజలి సినిమా ఎక్కడితో ఎండ్ అయిందో.. గీతాంజలి 2 సినిమా కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. పార్ట్ వన్ లో సినిమా తీసిన శ్రీను (శ్రీనివాస రెడ్డి) ఇంకో సినిమా ఆఫర్ కోసం ఊటీ వెళ్తాడు. అక్కడ నిర్మాత విష్ణు (రాహుల్ మాధవ్) వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి అంజలిని హీరోయిన్గా పెట్టాలని, బూత్ బంగ్లా సంగీత్ మహల్ లోనే.. సినిమా షూటింగ్ జరగాలని కండిషన్ లు పెడతాడు. సంగీత మహల్ లో శాస్త్రి(రవిశంకర్), అతని భార్య(ప్రియ), కూతురు దయ్యాలుగా ఉంటారు. ఈ ముగ్గురు దెయ్యాల కథ ఏంటి? విష్ణు శ్రీనుకి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు? అంజలి కి విష్ణు కి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read: KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్‌ హెచ్చరిక

Also Read: K Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News