బాహుబలి రికార్డుల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి చిత్రం దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కించుకుంది. పలు అవార్డులు, రివార్డులతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సాధించింది. ఒక ప్రాంతీయ చిత్రం ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం.. వెయ్యి కోట్ల మార్క్‌ను దాటడం చిత్ర పరిశ్రమలో ఇదే మొదటిసారి.
ఈ ఏడాది ఏప్రియల్ 2017లో రిలీజైన 'బాహుబలి 2' ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా 2017లో యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ట్రైలర్ జాబితాలో 'బాహుబలి 2' చిత్రం కూడా నిలవడం విశేషం. 8 కోట్లకు పైగా వ్యూస్‌తో 'బాహుబలి 2' ట్రైలర్ 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో 9 కోట్ల 10 లక్షల వ్యూస్‌తో హాలీవుడ్ 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' నిలిచింది. తరువాతి స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు 'ఇన్‌క్రెడిబుల్స్ 2', 'థోర్: రాగ్నారాక్' లు ఉన్నాయి. అదేవిధంగా బాలీవుడ్ చిత్రాలు 'టైగర్ జిందాహై', 'పద్మావతి' సినిమాలు 5 కోట్లకుపైగా ట్రైలర్ వ్యూస్ సాధించాయి.