Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు

Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్‌ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 23, 2024, 07:47 PM IST
Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు

Manchu Manoj Life Threat: ఆస్తి తగాదాలతో దశాబ్దాల పాటు గౌరవంగా ఉన్న మంచు కుటుంబ పరువును రోడ్డుపాలైంది. తల్లీదండ్రులతోపాటు సోదరుడు విష్ణు ఇలా కుటుంబం అంతా ఒక్కటై ఒంటరిని చేయడంతో మంచు మనోజ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకుండాచేయడంతోపాటు భౌతిక దాడులు చేయడం.. వాహనాల్లో చక్కెర పోయడం వంటి ఘటనలతో మనోజ్‌ తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ మంచు మనోజ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మంచు కుటుంబ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Sritej Family: రేవంత్‌ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు

మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణుతో మంచు మనోజ్‌కు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జర్నలిస్టుల దాడిపై పోలీసులు ఏ క్షణమైనా మోహన్‌ బాబును అరెస్ట్‌ చేసే ఆస్కారం ఉంది. రెండు, మూడు రోజులు సద్దుమణిగాయని భావిస్తున్న మంచు కుటుంబం గొడవల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. తాజాగా తన సోదరుడు విష్ణుపై మంచు మనోజ్‌ పోలీసులను ఆశ్రయించాడు. విష్ణుతో తనకు ప్రాణహానీ పొంచి ఉందని భయాందోళన చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఏడు పేజీల సుదీర్ఘ ఫిర్యాదును పోలీసులకు మనోజ్‌ అందించాడు. అయితే ఫిర్యాదులో విష్ణుతో పాటు వినయ్ అనే వ్యక్తిపై కూడా మనోజ్‌ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్‌ పోలీసులకు తన ఫిర్యాదును మనోజ్‌ ఇచ్చాడు.

Also Read: Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?

అయితే మంచు మనోజ్‌ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కాకుండా ఆన్‌లైన్‌ వేదికగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విష్ణుతోపాటు అతడికి దగ్గరి వ్యక్తి అయిన ప్సరాద్‌పై కూడా ఫిర్యాదు చేశాడు. మనోజ్‌ ఫిర్యాదు చేయడం వెనుక చేస్తుంటే మరోసారి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనోజ్‌ గర్భిణి అయిన తన భార్య మౌనిక, పిల్లల క్షేమం కోసం రహాస్య ప్రాంతంలో ఉన్నాడని తెలుస్తోంది. తన ఆచూకీ మోహన్‌ బాబు, విష్ణు కనుక్కోకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే మనోజ్‌పై మోహన్‌ బాబు, విష్ణు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై మోహన్‌ బాబు విరుచుకుపడ్డారు. ఈ అంశంలో ఇప్పటికే ముందస్తు బెయిల్‌కు వెళ్లగా హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌ బాబుకు భారీ షాక్‌ తగిలింది. త్వరలోనే పోలీసులు మోహన్‌ బాబును అరెస్ట్‌ చేశారని సమాచారం. అరెస్ట్‌ భయంతో మోహన్‌ బాబు పరారీలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News