EMI Ee Ammayi Trailer బిగ్ బాస్ షోలో భాను శ్రీ, నోయల్, మహేష్ విట్టా, చలాకీ చంటి, ధన్ రాజ్, సమీర్ ఇలా చాలా మంది సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా కలిసి ఈఎంఐ ఈ అమ్మాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై దొంతు రమేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి. రమేష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 10న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఇదేదో కాల్ మనీ, వ్యభిచార వ్యవస్థ చుట్టూ అల్లిన కథలా కనిపిస్తుంది. ఈఎంఐ పద్దతి అంటూ ఏదో కొత్తగా ట్రై చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అనిపిస్తోంది. ఈ ట్రైలర్లో మహేష్ విట్టా, ధన్ రాజ్ చేసిన కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉంది.
ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో.. నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో .సినిమా చాలా బాగా వచ్చిందని సమర్పకులు దొంతు బుచ్చయ్య అన్నారు. డైరెక్టర్ దొంతు రమేష్ మాట్లాడుతూ.. కరోనా టైంలో ఈ సినిమా కొరకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినా కూడా మా నాన్న అండగా నిలబడి సినిమాను పూర్తి చేశారని చెప్పుకొచ్చాడు.
నోయల్ మాట్లాడుతూ.. ఒక తండ్రి కృషి, కొడుకు ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి వెళతాను అంటే ఇంట్లో చాలా మంది ఎంకరేజ్ చేయరని అన్నాడు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే EMI ఈ అమ్మాయి అంటూ పేర్కొన్నాడు.
భాను శ్రీ మాట్లాడుతూ.. EMI అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుదని, అది పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు EMI కట్టకుండా ఉండేటటువంటి ఇల్లు ఉండదని చెప్పుకొచ్చింది. అందుకే EMI ఈ అమ్మాయి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని చెప్పుకొచ్చింది.
Also Read: Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్
Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook