Pallavi Prasanth Vs Arjun Ambati in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్-7 చివరి దశకు వచ్చే సరికి మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో నువ్వా-నేనా అన్నట్లు కంటెస్టెంట్లు వాదించుకున్నారు. ఒకరికి మంచి మరోకరు అన్నట్లు నామినేషన్స్‌లో గొడవకు దిగారు. గతవారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ తీసుకున్న చెత్త నిర్ణయంతో యావర్ నామినేషన్స్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. శోభా శెట్టి.. ప్రియాంకలను రాజమాతలుగా పెట్టి.. నామినేషన్స్‌కు ఏదో కారణం చెప్పాలని.. లేదంటే సిల్లీ రీజన్ అయినా చెప్పాలంటూ హౌస్‌మేట్స్‌కు చెప్పాడు. ఏ కారణం చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అవ్వాల్సి ఉంటుందన్నాడు. సిల్లీ కారణాలు చెప్పడం ఇష్టంలేక యావర్ సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడు. దీనికి రాజమాతగా ఉన్న శోభా శెట్టి.. యావర్ సెల్ఫ్ నామినేషన్‌కు ఒకే చెప్పింది.
నాగార్జున అడిగినప్పుడు మాత్రం ఎక్కడాలేని వినయం ప్రదర్శించింది. తాము పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోలేదు.. ఎవరినీ డామినేట్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. అమర్‌ను మూడుసార్లు సేవ్ చేసిన విషయాన్ని కూడా వెనకేసుకొచ్చింది. నాగార్జున కూడా ఆమెనే అభినందేశాడు. ఈ వారం నామినేషన్స్‌లో అసలు విషయం బయటపడిపోయింది. కావాలనే యావర్ నామినేషన్స్‌ను శోభా శెట్టి తన నోటితోనే ఒప్పుకున్నట్లయింది.
"గత వారమే నిన్ను నామినేట్ చేద్దామని అనుకున్నానని.. కానీ రాజమాతగా ఉండడంతో నామినేట్ చేయలేదు.." అంటూ శోభా శెట్టి నోరు జారింది. దీంతో వెంటనే పాయింట్ పట్టేసిన యావర్.. దొరికింది నాకు.. పాయింట్.. నామినేట్ చేయాలనుకునే చేశావ్ అన్నమాట అంటూ శోభా శెట్టి పరువు తీశాడు. రాజమాతగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు శోభా శెట్టినే ఇండైరెక్ట్‌గా ఒప్పుకోవడంతో యావర్ కరెక్ట్ టైమ్‌లో పాయింట్‌ను తీశాడు.
ఇక పల్లవి ప్రశాంత్, అర్జున్ మధ్య పెద్ద వాదనే జరిగింది. తాను ఎవరి ఇన్‌ఫ్ల్యూయెన్స్‌తో గేమ్ ఆడట్లేదని.. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చానని ప్రశాంత్ అనగా.. ఎవరో ఇన్‌ఫ్ల్యూయెన్స్ చేశారని తాను అనలేదని అర్జున్ అన్నాడు. నువ్వు అన్నావ్ అని ప్రశాంత్ సీరియస్‌గా అంటే.. "నేను అననిదాన్ని అన్నానని నువ్వు అంటున్నావ్" అంటూ అర్జున్ గట్టిగా అరిచాడు. నేను చెప్పేది తప్పని చెప్పడానికి నువ్వు ఎవరు రా.. అని ప్రశాంత్‌ను అన్నాడు. దీంతో వెంటనే ప్రశాంత్.. నేను ఎవరో గూగుల్‌ను అడుగు అంటూ సమాధానం ఇచ్చాడు. తనను నామినేట్ చేసింది నువ్వు కాబట్టి.. నిన్నే అడుగుతానని.. వేరే వాళ్లను ఎందుకు అడుగుతారా.. అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు.
Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?
Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook