Bigg Boss Telugu OTT Launch: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వేదికగా గ్రాండ్ లాంచ్ జరిగింది. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున మరోసారి అదరహో అన్పించగా, ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారిది నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మీ ముందుకొచ్చింది.
బిగ్‌బాస్ తెలుగులో మరో మైలురాయికి చేరుకుంది. ఇప్పటి వరకూ టీవీకే పరిమితమైంది తెలుగు బిగ్‌బాస్ షో. ఇప్పుడు హిందీలో ఉన్నట్టే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా డిస్నీ హాట్‌స్టార్‌లో ఓటీటీ వెర్షన్ ప్రారంభమైంది. మరోసారి హోస్ట్‌గా నాగార్జున సందడి మొదలైంది. ముందుగా అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున..హౌస్ ఎలా ఉందో ప్రేక్షకులకు చూపించారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 85 రోజులపాటు కొనసాగనుంది. ఓటీటీ కావడంతో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా కొనసాగనుంది. గతంతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ ఇంటిని మరింత అందంగా, విభిన్నంగా ముస్తాబు చేశారు.
కంటెస్టెంట్ల జాబితా
ముమైత్ ఖాన్, అఖిల్ సార్ధక్, అషురెడ్డి, హమీదా, సరయు, అరియానా గ్లోరీ, మహేశ్ విట్టా, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతు, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, రోల్ రైడా, యాంకర్ నిఖిల్, తనీష్, బిందు మాధవి, బమ్ చిక్ బబ్లూలతో బిగ్‌బాస్ తొలి ఓటీటీ ప్రారంభమైంది. నాగార్జున ఒక్కొక్కరినీ స్టేజ్‌పై పిలిచి..హౌస్‌లో పంపిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ కంటెస్టెంట్‌గా అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఇళ్లంతా తిరుగుతూ ఎగ్జైట్ అయింది. కింగ్ నాగార్జునకు ఏకంగా ముద్దు పెట్టేసింది. ఆషు ఆట ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానని ధీమా వ్యక్తం చేసింది. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేముందు ఊ అంటావా మావా పాట డ్యాన్స్‌తో దుమ్మురేపేసింది అషురెడ్డి. ఈసారి బిగ్‌బాస్‌లో వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ పోటీ ఉండనుందట. అంటే గతంలో జరిగిన బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకు, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు మధ్య పోటీ ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు.
Also read: Prabhas Radhe Shyam: ఆ పాయింట్‌కి ప్రభాస్ చాలా ఎక్సైట్ అయ్యారు: రాధాకృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook