Bigg Boss Telugu Season 6 Promo: ఎక్కడో నెదర్లాండ్స్ లో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమై అనేక దేశాలలోకి అనేక భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఆరో సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రోమో తాజగా విడుదలైంది.
మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ ఆరవ సీజన్ కూడా హోస్ట్ చేస్తున్నారు. ఒక ఆసక్తికరమైన అడ్వటైజ్మెంట్ తో ఈ ప్రోమో విడుదల చేశారు.. పెళ్లి తర్వాత పెళ్లి కుమార్తె అప్పగింతల సమయంలో బిగ్ బాస్ ప్రారంభమైనట్లు చూపించడంతో పెళ్లి కుమార్తెను వదిలేసి పెళ్ళికొడుకు సహా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అందరూ కలిసి బిగ్ బాస్ చూస్తున్నట్లు చూపించారు.
నాగార్జున పాయసం తింటూ ఎంట్రీ ఇచ్చి అన్ని పనులు మానేసి టీవీ ముందు అతుక్కుపోయారు అంటే బిగ్ బాస్ ప్రారంభమైనట్లే అంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 6 ప్రోమోను షో మీద ఆసక్తి పెంచే విధంగా కట్ చేశారు. ఇక ఈ షో ఎప్పుడు నుంచి మొదలవుతుందో క్లారిటీ లేదు కానీ ప్రోమో విడుదలైంది అంటే మరి కొద్ది రోజుల్లో ప్రారంభం అవ్వచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బిగ్ బాస్ తెలుగు ఆరవ సీజన్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. షోకి సంబంధించి బ్యాక్ ఎండ్ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయని అంటున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.
ఇక ఈసారి బిగ్ బాస్ 6లోకి శ్రీహన్ ( బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సిరి హన్మంత్ బాయ్‌ఫ్రెండ్), సీరియల్ నటి శ్రీ సత్య, ఆర్జే సూర్య, సోషల్ మీడియా ఫేమ్- గీతూ రాయల్, యూట్యూబ్‌లో ఫిల్మ్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి, యాంకర్ నేహా చౌదరి సహా ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన మరికొందరు ఉన్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సెట్ నిర్మాణం జరుగుతోందిని, సెప్టెంబర్ 4వ తేదీ నుంచి స్టార్ మాలో ఈ షో ప్రత్యక్ష ప్రసారం కానుందని అంచనాలు అయితే వెలువడుతున్నాయి.
Also Read: Tollywood: కోట్లలో బింబిసార లాభాలు.. సీతారామం బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో.. వసూళ్ల వివరాలివే!
Also Read: Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook