Saif ali khan discharged from hospital: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొత్తానికి ముంబైలోని లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ నివాసంలో.. ఈ నెల 16 న దాడి జరిగిన విషయం తెలిసిందే. రాత్రి పూట ఆగంతకుడు సైఫ్ ఇంటికి చోరీ వచ్చి సైఫ్ పై దాడికి పాల్పడ్డాడు.
Saif Ali Khan is back home after a harrowing incident. Let’s send him our best wishes for a swift recovery. 💖#zoomtv #bollywoodnews #breakingnews #entertainmentnews #celebritynews #fyp #saif #saifalikhan #saifalikhanfans #saifalikhanfc #kareena #kareenakapoorkhan… pic.twitter.com/mLNHiCtSQp
— @zoomtv (@ZoomTV) January 21, 2025
కత్తితో ఇష్టమున్నట్లు పొడిచాడు. దీంతో తోపులాట జరిగింది. సైఫ్ కుమారుడు మేల్కొవడంతో.. దుండగుడు పారిపోయాడు. సైఫ్ ను ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు సైఫ్ కు.. రెండు సర్జరీలు నిర్వహించారు. వెన్నుపాములో ఉన్న కత్తిని తొలగించారు. ఈ క్రమంలో ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.
నిందితుల కోసం సీసీ ఫుటేజీలను జల్లెడ పడ్డారు. అంతేకాకుండా.. నిందితుడు మహ్మాద్ షెహజాద్ థానెలో ఉన్నట్లు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హజరు పర్చారు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నాడు. పోలీసులు ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సైఫ్ ను లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
సైఫ్.. వైట్ కలర్ షర్ట్, లైట్ బ్లూకలర్ పాయింట్ వేసుకుని ఉన్నారు. ఆయన అభిమానులకు తాను.. ఆరోగ్యంగా ఉన్నానని విక్టరీ సింబల్ చూపిస్తు పలకరించారు. తన మేలు కోసం ప్రార్థనలు చేసిన వారందరికి , ఆస్పత్రి దగ్గరకు వచ్చిన అభిమానులకు అభివానం చేస్తు సైఫ్ తన ఇంటికి వెళ్లారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter